Anil Sunkara : అనిల్ సుంకరకు సెట్ కు వెళ్లే అలవాటు ఉండదు. కానీ చిరంజీవితో సినిమా అంటే మహేష్ బాబు ఒకటే చెప్పాడట. సెట్ కు వెళ్లి చూడు ఎలా ఉంటుందో చెప్పు అని సలహా ఇచ్చాడట. దీంతో చిరంజీవితో సినిమా చేస్తే అసలు పని చేసినట్లే ఉండదట. సరదాగా జోకులు వేస్తూ అందరిలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతారట. అందుకే భోళాశంకర్ సినిమా సెట్ లో అనిల్ సుంకర తెగ ఎంజాయ్ చేశాట్ట.
భోళాశంకర్ నిర్మత అనిల్ సుంకర. దూకుడు, ఆగడు వంటి చిత్రాలు నిర్మించడంతో మహేష్ బాబుకు ఆయనకు మంచి అనుబంధం ఉంది. చిరంజీవితో సినిమా అనగానే మహేష్ బాబు ఓ సలహా ఇచ్చాడు. చిరుతో సినిమా అంటే సరదాగా ఉంటుంది. షూటింగ్ కు రెగ్యులర్ గా వెళితే సంతోషంగా ఉంటుందని చెప్పాడట. దీంతో భోళా శంకర్ నిర్మాణంలో అనిల్ సుంకరకు మంచి అనుభవం ఎదురైంది.
భోళా శంకర్ మాస్ కమర్షియల్ సినిమా కావడంతో ఓపెనింగ్స్ కూడా అలాగే ఉంటాయని భావిస్తున్నారు. శుక్రవారం సినిమా విడుదల కానుంది. దీంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. చిరంజీవి శక్తి ఏమిటో అందరికి తెలుసు. మరోవైపు రజనీకాంత్ జైలర్ కూడా ఇప్పుడే వస్తోంది. రెండు సినిమాల ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై ప్రేక్షకుల్లో కూడా ఓ రేంజ్ లో ఉత్కంఠ నెలకొంది.
అనిల్ సుంకర చేతిలో పది సినిమాలున్నాయి. ఏజెంట్ నేర్పిన గుణపాఠంతో ప్రతి సినిమాను ప్రారంభ దశ నుంచే జల్లెడ పట్టేస్తున్నాడు. అనిల్ సుంకర సినిమాలు కచ్చితంగా లాభాలు తెచ్చిపెడతాయని నమ్మకంగా ఉన్నారు. భోళా శంకర్ కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని భావిస్తున్నారు. ఇక భోళా శంకర్ గురించి తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.