
KTR in America : తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖమంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అయితే ఆయన ఈసారి కుటుంబంతో వెళ్లలేదు. రాష్ర్టంలో పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పర్యటిస్తున్నారు. పలువురు పెట్టుబడిదారులను కలుస్తూ రాష్ర్టంలోఅమలవుతున్న పారిశ్రామిక విధానం, వనరులను వివరిస్తున్నారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఆయన చేస్తున్న పర్యటనకు అక్కడి తెలుగు వారు సహకరిస్తున్నారు. మంత్రి కేటీఆర్ పనితీరును వారు ప్రశంసిస్తున్నారు. తెలంగాణ రాష్ర్ట అభివృద్ధికి తామంతా కలిసి సాగుతామని వారు చెబుతున్నారు.
కాన్సులెట్ జనరల్ ఇండియా, యూఎస్ ఇండియాస్ర్టాటజీ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. న్యూయార్క్ లోనే తాను చదువుకొని, ఉద్యోగం చేసినట్లు గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సర్కారు పరిశ్రమల ఏర్పాటు విధానం ప్రగతిశీలమార్గంలో ఉన్నదని తెలిపారు. ప్రభుత్వం మొత్తం 14 రంగాలకు ప్రాధాన్యమిస్తున్నదని తెలిపారు. ఆ రంగాలకు విస్తృత రీతిలో అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. పెట్టబుడి దారులకు తెలంగాణ స్వర్గధామామని చెప్పుకొచ్చారు. ఐటీ పరిశ్రమల శాఖ జయేశ్ రంజన్ పాల్గొన్నారు. అంతకుముందు ఆయనకు యూఎస్ ఇండియా ప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతంపలికారు. వార్నర్ బ్రదర్స్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు.
దేశంలోనే యంగ్ అండ్ డైనమిక్ మంత్రిగా కేటీఆర్ కు పేరుంది. ఆయన వాగ్ధాటికి చాలా మంది ప్రముఖుులు ముగ్ధులవుతుంటారు. తెలంగాణలో ఐటీ రంగం అభివృద్ధిలో ఆయన క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీపడబోమని ఆయన చెబుతుంటారు. అమెరికా నుంచి రాష్ర్టంలో పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఆయన అక్కడ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను కలిశారు. రాష్ర్టంలో పెట్టుబడులకు అనుకూలించే అంశాలు,వనరులు, ప్రభుత్వం అందించే సహకారాన్ని వివరించారు. హైదరాబాద్ అభివృద్ధి జరుగుతన్న తీరు, తమ ప్రభుత్వం ఎజెండా తదితర వివరాలను అక్కడి ప్రముఖులతో చర్చించారు. పెట్టుబడులతో రాష్ర్టానికి వస్తే ఘన స్వాగతం పలుకుతామని చెప్పుకొచ్చారు. దేశంలోనే గణనీయ అభివృద్ధి దిశగా తమ రాష్ర్టం దూసుకెళ్తున్నదని వారికి వివరించారు.