Ramyakrishna : రమ్యకృష్ణన్.. ఈమెకు ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పని లేదు.. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ లో ఈమె పేరును లిఖించుకుంది.. రమ్య కృష్ణ ఏ పాత్రకైనా ప్రాణం పోస్తుంది.. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది.. ఈమె చేస్తే ఒక పాత్రకు పవర్ వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు..
ఈ భామ చేసినన్ని పవర్ఫుల్ రోల్స్ ఇంకే హీరోయిన్ చేయలేదు.. చాలా రోజుల తర్వాత రమ్యకృష్ణ, రజినీకాంత్ జోడీ తెరమీద కనిపించారు.. జైలర్ సినిమాలో వీరిద్దరూ భార్య భర్తలుగా నటించారు. ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యి మంచి టాక్ తో దూసుకు పోతుంది. ఇదిలా ఉండగా రమ్యకృష్ణ జైలర్ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చింది..
ఈమె నరసింహ సినిమా గురించి మాట్లాడుతూ.. కేవలం రజినీకాంత్ సినిమాలో ఉండాలనే కోరిక వల్లనే ఈ రోల్ ను ఒప్పుకున్న.. అయితే ఈ సినిమాలో సౌందర్య ముఖం మీద కాలు పెట్టే సన్నివేశం చేసేప్పుడు భయపడ్డా.. ఎందుకంటే ఆ సీన్ లో ముఖం మీద కాలు పెడితే ప్రేక్షకులు కొడతారేమో అని టెన్షన్ పడ్డ..
డైరెక్టర్ ఎంతో బ్రతిమిలాడడంతో పాటు.. సౌందర్య దైర్యం చెప్పడంతో నటించాను.. రజినీకాంత్ గారితో పోటీ పడి మరీ ఈ సినిమాలో నటించగా మంచి గుర్తింపు తెచ్చింది.. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో రజినీకాంత్ తో చేసిన జైలర్ సినిమాలో మా మధ్య వచ్చే సీన్స్ అలరిస్తాయని ఈ రోల్ కూడా గుర్తుండి పోయే రోల్ అవుతుంది అని ఈమె చెప్పుకొచ్చింది..