
Mahesh Babu మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమాపై ఎన్నో రూమర్లు వస్తున్నాయి. సినిమా మధ్యలోనే ఆగిపోయిందని వార్త ఒకటి సంచలనంగా మారింది. దీనికి తోడు షూటింగ్ కూడా నిరాటంకంగా సాగడం లేదు. కొద్ది రోజులు నడిచి మళ్లీ వాయిదా పడటం కనిపిస్తూనే ఉంది. దీంతో గుంటూరు కారం సినిమా పూర్తి కావడం గగనమే అని తేలిపోయింది.
వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తరువాత వచ్చిన ఖలేజా మాత్రం నిరుత్సాహ పరచింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్ కలిసింది. కానీ షూటింగ్ మాత్రం వేగంగా జరగడం లేదు. దీంతో సినిమాపై ఎన్నో అనుమానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాణం ఆగిపోయిందనే వార్త హల్ చల్ చేస్తోంది.
ఇటీవల మరో వార్త సినిమాకు ప్లస్ గా మారింది. ఇందులో రమ్యక్రిష్ణ ఓ ముఖ్య పాత్ర పోషిస్తుందనే వార్త సంచలనం కలిగిస్తోంది. రమ్యక్రిష్ణ మహేష్ బాబు అప్పుడెప్పుడో పందొమ్మిది ఏళ్ల క్రితం నాని సినిమాలో కలిసి నటించారు. తరువాత అలాంటి అవకాశం రాలేదు. కానీ ఇప్పుడొచ్చింది. స్వయంగా ఆమె ఈ విషయాన్ని బయటపెట్టింది. మహేష్ బాబు పుట్టిన రోజు ఆగస్టు 9న దీని గురించి కీలక ప్రకటన ఉంటుందని చూస్తున్నారు. గుంటూరు కారం సినిమా ఇక పట్టాలెక్కనుందా? లేదా? అనేది తేలాల్సి ఉంది.
గుంటూరు కారానికి సంగీతం థమన్ అందిస్తున్నాడు. ఇప్పటి వరకు ఒక్క పాట కూడా ట్యూనింగ్ చేయలేదని సమాచారం. దీంతో థమన్ ను ఈ సినిమా నుంచి తొలగించారని టాక్ వచ్చింది. దీన్ని థమన్ ఖండించాడు. మరోవైపు ఫొటో గ్రాఫర్ కూడా తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి. దీంతో ఇక గుంటూరు కారం మనుగడ కష్టమేనని వాదనలు కూడా వచ్చాయి.