Is There Democracy : మన రాజ్యాంగం ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అంటూ మన పాలకుల్ని మనమే ఎన్నుకునే అవకాశం ఇచ్చింది. మన పాలకుల్ని సేవకులుగా గుర్తించి ఎన్నుకోవాలి. ప్రజలే ప్రభువులు అంటే ఏక్ దిన్ కా సుల్తాన్ లుగా మారుతున్నారు. ఓటర్లను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు. తమ గెలుపులో వారినో యంత్రాలుగానే మారుస్తున్నారు.
ఈ రోజుల్లో ఓటర్ల సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. డబ్బులు తీసుకుని ఓటేసే సంప్రదాయం పెరిగింది. ఉచిత పథకాల పేరుతో ఓటర్లకు గాలం వేస్తున్నాయి. ఒక పార్టీ కంటే మరోపార్టీ ఉచితాలు ప్రకటిస్తూ రాష్ట్రాన్ని అధోగతి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో అభ్యర్థులు పనిచేస్తారనే నమ్మకం ఎవరికి ఉండటం లేదు. ఒకరి మీద కోపంతో మరొకరికి ఓటు వేస్తున్నారంతే.
ఓటు వేయడానికి ఎక్కువ మంది ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పల్లెల్లో అరవై నుంచి డెబ్బై శాతం ఓటింగ్ శాతం నమోదవుతున్నా పట్టణాల్లో యాభై శాతం కూడా నమోదు కావడం లేదు. ఎన్నికలంటే ఓటర్లు విలువ ఇవ్వడం లేదు. దీంతోనే ఓటింగ్ శాతం సరిగా నమోదు కావడం లేదు. ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద విఘాతమే. హైదరాబాద్ లో మరీ దారుణంగా ఓటింగ్ శాతం నమోదవుతోంది.
ఓటర్లను ఓటు బ్యాంకుగా చూసినంత కాలం మన దేశం బాగుపడదు. పనిచేసే నాయకుడు కనిపించడం లేదు. అందరు డబ్బులు ఇచ్చే వారికే ఓటు వేస్తూ సంప్రదాయానికి తూట్లు పొడుస్తున్నారు. పూర్వం రోజుల్లో మనిషి గుణగణాలు చూసి ఓటేసేవారు. ఇప్పుడు డబ్బు చూసి వేస్తున్నారు. నోటుకు ఓటును అమ్ముకున్నంత కాలం మన బతుకులు ఇలాగే ఉంటాయి.