
Anasuya Change : స్టార్ యాంకర్ గా అనసూయ క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు.. ఈమె ఫాలోయింగ్ రోజురోజుకూ పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. ఇక ఇప్పుడు పూర్తిగా యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసి కేవలం సినిమాల మీదనే ఫోకస్ పెట్టి బిగ్ స్క్రీన్ మీద కూడా తన హవా కొనసాగించాలని అనసూయ తహతహ లాడుతుంది.
అందుకే ఈమె ఏకంగా ఇన్నేళ్ళలో ఎప్పుడు వేయని బికిని సైతం వేసి అందాలు తెగ ఆరబోస్తుంది. మరి ఇందుకు తగ్గట్టుగానే ఈమెకు బోల్డ్ రోల్స్ వస్తున్నాయి.. రీసెంట్ గా ఈమె నటించిన విమానం సినిమాలో అనసూయ వేశ్య పాత్రలో నటించి ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది. ఇక అలానే కొన్ని కొన్ని సినిమా అవకాశాలు అయితే అందుకుంటుంది..
ఇదిలా ఉండగా ఈ భామ తరచు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంటుంది.. ఏదొక వార్తతో ఈమె నిత్యం హాట్ టాపిక్ అవుతుంది. ఇక తాజాగా ఈమెలో మార్పు వచ్చిందంటూ ఈమె వీడియో పోస్ట్ చేయగా మళ్ళీ అందుకు కారణం ఏంటో తెలిసేలా మరో పోస్ట్ పెట్టింది. ఒక ఓల్డ్ పిక్ షేర్ చేస్తూ.. ”నువ్వు వెనుకకు వెళ్లి ప్రారంభాన్ని మార్చలేవు.. కానీ నీ ముగింపును మార్చుకోవచ్చు” అంటూ ఈమె రాసుకొచ్చింది..
దీంతో అనసూయ తనపై వచ్చిన వివాదాలను వెనక్కి వెళ్లి మరీ మార్చుకోలేదు కాబట్టి ముందు ముందు అలంటివి రాకుండా ఎలాంటి వివాదాల్లో జోక్యం చేసుకోకుండా ఉండవచ్చని ఈమె అనుకున్నట్టు ఉంది.. అందుకే ఇలాంటి పోస్ట్ పెట్టిందంటూ నెటిజెన్స్ అంటున్నారు. అంతేకాదు ఈమె ఈ మధ్య ఓవర్ గా గ్లామర్ కూడా ఒలికించడం లేదు.. ఇక ఈమె ప్రభుదేవా ఉల్ఫ్ లో నటించగా ఈమె టీజర్ లో అదరగొట్టింది..