AP BJP : బిజెపి కీలక నేతల సమావేశం జరుగుతుంది. పొత్తలపై నడ్డా కీలక ప్రకటన చేసే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే ఎగ్జిక్యూటివ్, వివిధ మోర్చాల సమావేశాలు ముగిసాయి. పొత్తులపై చర్చించేందుకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురం దేశ్వరి తో పాటు రాష్ట్ర నాయకులు ఇప్పటికే ఢిల్లీలో ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఏపీలో ఉన్న తాజా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బిజెపి పొత్తుపై వెళితే ఎలాంటి సమీకరణాలు ఉండబోతున్నాయన్న అంశాలపై రెండు రోజుల పాటు బిజెపి అధిష్టానం ఏపీ నాయకులతో చర్చలు జరిపారు.
ఈ చర్చల్లో ఏపీ నాయకులు కొన్ని కీలక విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు అయితే పొత్తు పై బిజెపి అధిష్టానం ఒక కీలక ప్రకటన వెలువరించబోతోంది. ఇప్పటికే మిత్రప క్షాలైన తెలుగుదేశం, జనసేన లతో బిజెపి అగ్ర నాయకులు చర్చలు జరిపారు. ఆ తర్వాత రాష్ట్ర బీజేపీ నాయకులను ఢిల్లీకి పిలిపించి పొత్తు అంశంపై వారితో చర్చించారు. చర్చలు ముగిసిన నేపథ్యంలో పొత్తుపై ఇవాళ కీలక ప్రకటన రాబోతుంది.