29.2 C
India
Saturday, May 4, 2024
More

    2023 Destinations : గూగుల్ లో అత్యధికంగా భారతీయులు వెతికిన ప్రాంతాలివే!

    Date:

    2023 Destinations
    2023 Destinations

    2023 Destinations : హాలీడేస్ వస్తున్నాయంటే చాలు ఓ టూర్ కు వెళ్లొద్దాం అని రెడీ అయిపోతారు జనాలు. మన దేశంలో ఉన్న వందలాది టూరిస్ట్ ప్లేసుల తో పాటు ప్రపంచం నలుమూలల్లో ఉన్న టూరిస్ట్ ప్లేస్ లకు భారతీయులు తరలివెళ్తారు. 2023 ఏడాది మరో కొన్ని రోజుల్లో ముగిసిపోతుంది. ఈ ఏడాదిని ఒకసారి రివైండ్ చేసుకుందాం. ఈ ఏడాది అత్యధిక భారతీయులు గూగుల్ లో సెర్చ్ చేసిన టూరిస్ట్ ప్రదేశాల జాబితాను గూగుల్ రిలీజ్ చేసింది. అందులో టాప్ టెన్ లో ఈ కింది ప్రదేశాలు నిలిచాయి. అవెంటో చదవండి..

    వియత్నాం:  ఈ ప్రదేశం టాప్ టెన్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది. బీచ్ లు, గుహలు, ప్రకృతి అందాలు, చారిత్రక అంశాలకు వియత్నాం నెలవు. వేసవి కాలంలో ఇక్కడికి వెళ్లడానికి అనువైన సీజన్. హాలాంగ్ బే, న్హా ట్రాంగ్, కాన్ దావో, పు క్వాక్.. వంటి ఇక్కడ తప్పనిసరిగా చూడాల్సిన ప్రాంతాలు.

    గోవా: ఇది ఇండియన్స్ కు టాప్ ప్రయారిటీ ప్లేస్. గోవా బీచ్ ల్లో షికారు కొట్టాలని ప్రతీ ఒక్కరూ ఇష్టపడుతారు. ఇక్కడి బీచ్ లు, పోర్చుగీస్ కట్టడాలు, గ్రీనరీ, సూర్యోదయ, సూర్యాస్తమ సమయాలు చూడడానికి లక్షలాది మంది టూరిస్టులు తరలివస్తారు.  వీటితో పాటు అగ్వాడ కోట సందర్శించాల్సిన ముఖ్య ప్రాంతం.

    బాలి: ఇండోనేసియా దేశంలోని కీలక ప్రాంతం. జావా, లాంబాక్ దీవుల మధ్యలో బాలి దీవి ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా హిందువులు ఉంటారు. బాలిలో దిన్ పాసార్, సింగరాజా సిటీలు టూరిస్టులను విపరీతంగా ఆకట్టుకుంటాయి.. బీచ్ లు, ప్రకృతి అందాలు అద్భుతహ: అనిపిస్తాయి.

    శ్రీలంక: గతంలో సిలోన్ గా పిలువబడిన శ్రీలంక. ప్రపంచంలోని అందమైన ద్వీపాల్లో ఒకటి. ఇక్కడ అందమైన బీచ్ లు, జలపాతాలు, అడవులు ఉన్నాయి. రామయణంతో ముడిపడి ఉన్న ప్రాంతమిది. భారత్ కు పక్కనే ఉండడంతో ఇక్కడికి రావడానికి భారతీయులు ఎక్కువగా ఇష్టపడతారు. ఇక్కడ సిగిరియా రాతికోట, మిరిస్సా బీచ్, ఎల్లా హిల్ స్టేషన్, బౌద్ధ దేవాలయాలు, కొలంబో, అభయారణ్యం ఇలా ఒక్కటేమిటి ఎన్నెన్నో అందాలు ఈ చిన్న దేశంలో ఉన్నాయి.

    థాయిలాండ్: ‘‘థాయి మసాజ్ ..’’ వెరీ పాపులర్ అని మనకు తెలిసిందే. అతి తక్కువ ధరలో థాయి ట్రిప్ వేయవచ్చు. అందుకే ఇండియన్ యూత్ గోవా తర్వాత థాయిలాండ్ కు ప్రిఫరెన్స్ ఇస్తారు.  ఇక్కడి పట్టాయా సిటీలోని బీచ్ రిసార్ట్ లు, హోటళ్లు.. కౌయాయ్ లో రిసార్టులు, పచ్చని చెట్లు, పర్వతాలు ఆకట్టుకుంటాయి. అమ్యూజ్ మెంట్ పార్కులు, అడ్వెంచర్స్ గేమ్స్, స్విమ్మింగ్ ఫూల్స్, షాపింగ్ సెంటర్స్, థాయి మసాజ్ సెంటర్స్.. ఇలా బ్యాంకాంక్ స్వర్గ నగరమే అని చెప్పాలి. అలాగే ఇక్కడి ఎమరాల్డ్ బౌద్ధ ఆలయం బాగా ఫేమస్.

    కాశ్మీర్:  దీన్ని భూలోక స్వర్గం అంటారనేది తెలిసిందే. కాశ్మీర్ లో శ్రీనగర్, గుల్ మార్గ్, పహల్ గావ్ ముఖ్య పర్యాటక ప్రాంతాలు. సాఫ్రాన్ టౌన్, మార్ట్ లాండ్ టెంపుల్, సన్ టెంపుల్.. దాల్ సరస్సు, మంచు కొండలు.. ఇలా కాశ్మీర్ అంతా సుందర ప్రదేశమే.

    కూర్గ్: కొత్త జంటలకు ఇక్కడికి వెళ్లడానికి ఎక్కువగా ఇష్టపడుతారు.  విశాలమైన కాఫీ తోటలు, పచ్చని ఆరణ్యాలు, కొండలు, లోయలతో ఎంతో అందమైన ప్రాంతమిది. కర్నాటకలో ఇది చిన్న ప్రాంతం. ఇక్కడ మడకేరి సోమవారపేటలోని పుష్పగిరి కొండ శ్రేణి, విరాజ్ పేటలోని అతిపెద్ద తేనె ఉత్పత్తి కేంద్రం ఫేమస్. అలాగే అబ్బే జలపాతం, ఇరుప్పు జలపాతం, బ్రహ్మగిరి కొండలు, నాగర్ హోల్ నేషనల్ పార్క్, ఓంకారేశ్వర దేవాలయం.. వంటి ఫేమస్ ప్రదేశాలు ఉన్నాయి.

    అండమాన్, నికోబార్: ఇక్కడ సెల్యులార్ జైలు, మహాత్మాగాంధీ మెరైన్ నేషనల్ పార్క్, అండమాన్ వాటర్ స్పోర్ట్స్, వండూర్ బీచ్, ఫారెస్ట్ మ్యూజియం టూరిస్టులను తెగ ఆకర్షిస్తున్నాయి.

    ఇటలీ: ప్రపంచంలోనే అత్యధికంగా టూరిస్ట్లులు సందర్శించే ప్రదేశాల్లో ఇది 5వ స్థానంలో ఉంది. అందమైన లోకేషన్లు, బీచ్ లు, కట్టడాలు ఆకర్షిస్తాయి. ఇక్కడి మిలాన్ ఫ్యాషన్ నగరం. రోమ్ లోని పీసా టవర్.. ఇలా దేశమంతా టూరిస్టు ప్లేసే.

    స్విట్జర్లాండ్: టూరిజానికి కేరాఫ్ అడ్రస్ స్విట్స్. ఇక్కడి ఎత్తైన పర్వతాలు, లోయలు.. ఆల్ఫ్స్ చెట్లు, జురా పర్వతాలు టూరిస్టులను ఆకర్షిస్తాయి. ఇక్కడ ఒలంపిక్స్ మ్యూజియం, కేథడ్రల్ చర్చి, లౌసాన్ టవర్, ఊచి వాటర్ ఫ్రంట్.. చూడాల్సినవి.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    GOOGLE: లోపాలు చెప్పి కోటి రూపాయలు గెలిచిన వ్యక్తి..

      ఎవరైనా ఏదైనా పని చేసినప్పుడు.. అందులో తప్పుందని మనం చెబితే వారు...

    IT companies : ఉద్యోగుల కోత విధిస్తున్న ఐటీ కంపెనీలు

    IT companies : ఆర్థిక మాంద్యం భయపెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా దేశాలను...

    Google : గూగుల్ లో ఎక్కువగా ఏం వెతుకుతున్నారో తెలుసా?

    Google : ఇప్పుడు అందరు ఆధారపడుతోంది గూగుల్ పైనే. ఏది కావాలన్నా...

    Social Media: ప్రపంచం ఎక్కువగా చూస్తున్న సైట్స్ ఏవో తెలుసా?.. సోషల్ మీడియాకే అధిక ప్రాధాన్యత..!

    Social Media :  ఇండియా ఇప్పుడిప్పుడే 5G కి కనెక్ట్ అయ్యింది....