Social Media : ఇండియా ఇప్పుడిప్పుడే 5G కి కనెక్ట్ అయ్యింది. కానీ ప్రపంచంలో చాలా ఉన్నతమైన దేశాలు ఎప్పుడో 5Gని దాటి 6Gపై కూడా పరిశోధనలు చేస్తున్నాయి. మారుతున్న జీవన ప్రమాణాలతో మనిషి జీవనం మరింత సులువుగా మారుతుంది. ఏ అవసరం ఉన్నా ఇప్పుడు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. సెల్ ఫోన్ లో ఒక్క మీట నొక్కితే చాలు మీ కాళ్ల కాడికి వచ్చి చేరుతుంది. మరీ ప్రాణం మీదకు వస్తే తప్ప ఇంటి నుంచి కదలడం లేదు. ఇక కరోనా నుంచి పూర్తిగా ఇంటి (వర్క్ ఫ్రం హోం) కే పరిమితమైన ఉద్యోగులు ఏ అవసరం ఉన్న సంబంధిత సైట్లలోకి వెళ్లి కష్టపడకుండా అవసరం తీర్చుకుంటున్నారు.
అయితే, ఇటీవల ఒక సంస్థ ప్రపంచం మొత్తంలో ఎక్కువగా ఉపయోగిస్తున్న సైట్ ఏంటి? అంటూ సర్వే నిర్వహించింది. ఇది ఒక నెల(జూన్)ను బేస్ చేసుకొని నిర్వహించింది. ఇందులో కొన్ని ఆసక్తి కర విషయాలు బయటపడ్డాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కువగా చూస్తున్న సైట్లలో మొదటి స్థానంలో ‘గూగుల్’ నిలవగా 10వ స్థానంలో ‘వాట్సప్’ నిలిచింది. ఏ విషయం గురించి మనం తెలుసుకోవాలన్నా మొదట ఓపెన్ చేయాల్సింది గూగులే కాబట్టి ఫస్ట్ ప్లేస్ లోకి వెళ్లింది. అయితే తర్వాత మాత్రం చాలా వరకు సోషల్ మీడియా ప్లాట్ ఫారాలే ఉండడం గమనార్హం. సెకండ్ ప్లేస్ నుంచి వరుసగా చూస్తే యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టా, ట్విటర్, baidu.com, వీకీపీడియా, యాహూ, తొమ్మిదోస్థానంలో yandex.com ఉన్నాయి.
సోషల్ మీడియా ప్లాట్ ఫారాలను ప్రజలు ఎక్కువగా విజిట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో వికీపిడియా ఉండడం కొంత వరకు మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంటే ఇంకా ఎంతో మందిలో కొత్త విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండడం హర్షించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రీల్స్, కామెంట్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది అంటున్నారు.