29.1 C
India
Monday, July 8, 2024
More

    Naga Chaitanya : హైదరాబాద్ ను వీడనున్న నాగ చైతన్య..ఇక అక్కడే మకాం!

    Date:

    Naga Chaitanya
    Naga Chaitanya

    Naga Chaitanya :  అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం నుంచి  టాలీవుడ్ కు పరిచయమైన మూడో తరం హీరో అక్కినేని నాగచైతన్య. తాత, తండ్రి బాటలోనే రొమాంటిక్ స్టార్ ఇమేజ్ తో దూసుకెళ్తున్నాడు.  తనకు ఈ ఇమేజ్ రాత్రికి రాత్రి వచ్చింది కాదు.  ఘనమైన కుటుంబ వారసత్వం ఎంట్రీ వరకే పనికొచ్చింది. కానీ టాలెంట్ నిరూపించుకోవాల్సింది తానేనని నాగ చైతన్య గ్రహించారు.  హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమా జోష్ ఫర్వాలేదు అనిపించుకున్నా.. ఆశించిన స్థాయి హిట్ కాలేదు. రెండో సినిమా దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఏమాయ చేశావేతో కెరీర్ లో తొలి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఆ వెంటనే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 100% లవ్‌తో మరో  సక్సెస్ అందుకున్నారు. ఈ వరుస హిట్లతో నాగచైతన్య రేంజ్ పెరిగింది. కానీ ఈ జోష్‌ను ఆయన కొనసాగించలేకపోయారు.

    దడ, బెజవాడ, ఆటోనగర్ సూర్య, తడాఖా, దోచేయ్, సవ్యసాచి, సాహసమే శ్వాసగా సాగిపో, శైలజారెడ్డి అల్లుడు సినిమాలు ఆశించిన విజయం సాధించలేకపోయాయి. మాస్ ఫాలోయింగ్‌ కోసం ట్రై చేసి చైతన్య చేతులు కాల్చుకున్నాడంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ అధైర్యపడకుండా తనకు అచ్చొచ్చిన లవ్ స్టోరీలతోనే మరోసారి హిట్ బాట పట్టాడు. ఒక లైలా కోసం, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, మజిలీ, వెంకీ మామ, లవ్‌స్టోరీ, బంగార్రాజు, థ్యాంక్యూ వంటి సినిమాలు సక్సెస్ కొట్టి రేసులో నిలబడ్డాడు.  అయితే వ్యక్తిగత జీవితంలో నాగచైతన్య ఇబ్బంది పడ్డారు.

    ఏమాయ చేశావే తనకు జోడీగా నటించిన సమంతని పెళ్లి చేసుకున్న చైతన్య.. రెండేళ్ల క్రితం ఆమె నుంచి విడిపోయారు. కుటుంబంతో దూరంగా , ఒంటరిగా ఉండటానికి ఇష్టపడే చైతన్య ఓ చిన్న ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. సినిమాలు, షూటింగ్‌లలో తన పని తాను చేసుకుపోతూ.. ఖాళీ సమయాల్లో తనకు ఇష్టమైన కారులో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లడాన్ని చైతూ ఏంజాయ్ చేస్తుంటారు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఇప్పటి వరకు ఏ వివాదంలోనూ ఆయన తలదూర్చలేదు. ప్రస్తుతం నాగచైతన్య చందు మొండేటి దర్వకత్వంలో తండేల్ అనే సినిమాలో నటిస్తున్నారు.

    తండేల్ మూవీ తన కెరీర్‌లోనే  బెస్ట్ సినిమా అవుతుందని ఆయన ధీమాగా ఉన్నారు.  మత్స్యకారుడి పాత్ర కోసం చైతూ పూర్తిగా వారిలా మారిపోయారు. వారి వేష భాషలు , బాడీ లాంగ్వేజ్‌ను నేర్చుకోవడం కోసం శ్రీకాకుళం జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల్లోనే నివసించారు.  చెన్నై, హైదరాబాద్, ముంబై నగరాలు తనకు ఇష్టమైన ప్రదేశాలని ఎన్నోసార్లు చెప్పిన ఆయన.. రిటైర్ అయ్యాక మాత్రం గోవాలో సెటిలైపోతానని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎన్ని ప్రాంతాల్లో తిరిగినా గోవా తనకు చాలా స్పెషల్ అని ఆయన చెప్పారు. తనకు 45 ఏళ్లు వచ్చేసరికి గోవాకి షిఫ్ట్ అయి.. ఏడాదికి ఒక సినిమా చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నానని నాగచైతన్య తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Hemant Soren : జార్ఖండ్ అసెంబ్లీలో.. బల పరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్

    Hemant Soren : జార్ఖండ్ అసెంబ్లీలో సీఎం హేమంత్ సోరెన్ ప్రభుత్వం...

    Punjab : నీళ్ల పంపిణీ గొడవలో కాల్పులు.. నలుగురు మృతి

    Punjab : పంజాబ్ రాష్ట్రం బటాలాలోని శ్రీహరగోవింద్ పూర్ దగ్గర దారుణం...

    Actress Lahari : మొగిలి రేకుల ఫేమస్ లహరి కోటి రూపాయల కారు ఎలా కొనిందబ్బా

    Actress Lahari : మొగిలి రేకుల సీరియల్ తో ఫేమస్ అయిన...

    CM Revanth : వైఎస్సార్ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం: సీఎం రేవంత్

    CM Revanth : వైఎస్సార్ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vyjayanthi Movies : వైజయంతీ మూవీస్ తో అరంగ్రేటం చేసిన హిరో, హిరోయిన్లు వీరే.. 

    Vyjayanthi Movies : వైజయంతి మూవీస్ అంటే నిన్న మొన్నటి వరకు కేవలం...

    Superstar Krishna : మహేష్ సినిమాపై నెగిటివ్ ప్రచారం.. సీరియస్ అయిన సూపర్ స్టార్ కృష్ణ

    Superstar Krishna : మహేష్ బాబు ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయం...

    CM Revanth Reddy : వరంగల్ ను మరో హైదరాబాద్ చేస్తా: సీఎం రేవంత్ రెడ్డి

    CM Revanth Reddy : హైదరాబాద్ తో సమానంగా వరంగల్ ను...

    Hyderabad News : సెల్ ఫోన్ చోరీ ముఠా అరెస్టు.. గాయపడిన మసూద్

    Hyderabad News : సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కరడుకట్టిన...