
Operation Raavan Teaser : పలాస ఫేం రక్షిత్ అట్లూరి నటించిన తాజా చిత్రం ఆపరేషన్ రావణ్. నిర్మాతగా ధ్యాన్ అట్లూరి, రచయితగా, దర్శకుడిగా వెంకట సత్య వ్యవహరిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. రాధిక శరత్ కుమార్, రఘు కుంచె లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ థ్రిల్ వీడియోను ప్రసాద్ ల్యాబ్‌లో ప్రదర్శించారు. ఈ వేడుకకు దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, మారుతి, దర్శకుడు కల్యాణ్ కృష్ణ, సీనియర్ నటి రాధిక హాజరయ్యారు.
ఆపరేషన్ రావణ్ వీడియో మంచి ఫీల్‌ను, థ్రిల్లింగ్‌ను అందించింది. ఈ సినిమా టీజర్‌లో ఇంటెన్స్ మూమెంట్స్ కనిపించాయి. దుష్టశక్తి, దైవశక్తకి మధ్య జరిగే పోరాటం ఈ సినిమాలో చూపెడుతున్నట్లు ఫీల్‌ను కల్పించాయి. ఈ వీడియోలో హీరో రక్షిత్ అట్లూరి ఎమోషన్స్, లుక్స్ అదరగొట్టాయి. మిస్టరీ మ్యాన్ విలన్‌గా రకరకాల రూపాలతో దశావతారం ఆకట్టుకుంది. ఇక రాధిక శరత్ కుమార్ ఒక సీన్‌లో ఇచ్చిన లుక్ భావోద్వేగాలను చెప్పకనే చెప్పాయి.
ఆపరేషన్ రావణ్ ఫస్ట్ థ్రిల్ వీడియో చూస్తే.. హై ఎమోషన్స్, రా, రగ్గడ్ హీరో, కొత్త రకంగా కథ, కథనాలు, గెటప్స్ ఆకట్టుకొనే రేంజ్‌లో కనిపించాయి. ఈ వీడియో సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాయని కామెట్లు వస్తున్నాయి. రక్షిత్, వెంకటసాయి కాంబోలో హిట్‌గా మారడం ఖాయమని చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాధిక శరత్ కుమార్ యాక్టింగ్, మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ పాజిటివ్ అంశాలుగా కనిపించాయి.
ఇక సాంకేతిక అంశాలను పరిశీలిస్తే.. నటులు: రక్షిత్ అట్లూరి, రఘు కుంచె, రాధిక శరత్ కుమార్ తదితరులు, డైరెక్టర్ గా వెంకట సత్య, ప్రొడ్యూసర్ ధ్యాన్ అట్లూరి, సినిమటో గ్రఫి నాని చమిడిశెట్టి, ఎడిటర్ గా సత్య గిదుటూరి మాటలు లక్ష్మీ లోహిత్ పూజారి, పాటలు వెంకట సత్య, ప్రణవం, పూర్ణాచారి, ఫైట్స్ స్టంట్స్ జాషువా, ఆర్ట్ టీనాని, పీఆర్వో జీఎస్కే మీడియా వ్యవహరిస్తోంది.