33.2 C
India
Saturday, May 4, 2024
More

    Hariramajogaiah : ఏపీ సీఎం జగన్ పై పిటిషన్.. కాపు నేతపై హైకోర్టు ఆగ్రహం

    Date:

     

     

    Petition against AP CM Jagan.. High Court angry with Kapu leader : 

    ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులకు సంబంధించి, పెండింగ్ కేసులకు సంబంధించి కాపు సంఘం నేత చేగొండి హరి రామ జోగయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ పై హైకోర్టు సీరియస్ అయింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై ప్రజా ప్రయోజన వాజ్యం కింద పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు తీవ్రంగా మందలించింది. ఇలాంటి పిటిషన్లు వేసి కోర్టు విలువైన సమయాన్ని వృథా చేయొద్దని పేర్కొంది. చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని దిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఈ పిటిషన్ పై సోమవారం హరిరాగమ జోగయ్య తరపు న్యాయవాదివాదనలకు సిద్ధం కాగా, వెంటనే ధర్మాసనం కలుగజేసుకుంది. ఇందులో ప్రజా ప్రయోజనం ఏముందని ప్రశ్నించింది. వ్యక్తిగత కక్షతోనే పిటిషన్ వేసినట్లు కనిపిస్తున్నదని అభిప్రాయపడింది. ఓ మాజీ ఎంపీ ఇలా వ్యవహరించడం సరికాదని చెప్పింది.

    అయితే ఈ పిటిషన్ లో సీఎం జగన్ అక్రమాస్తులకు సంబంధించిన విచారణను త్వరగా పూర్తిచేయాలని హరిరామ జోగయ్య కోరారు. దీనిపై రాష్ట్రపతికి లేఖ రాశానని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా లేఖ రాశానని అందులో పేర్కొనడంపై హైకోర్టు మండిపడింది. ఉన్నత స్థాయి వ్యక్తులకు, వ్యవస్థకు చెప్పినంత మాత్రాన కింది స్థాయి కోర్టు భయపడేది ఉండదని, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని తీవ్రంగా మందలించింది బాధ్యత గల మాజీ పార్లమెంట్ సభ్యుడే ఇలా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించింది. వ్యక్తిగత ద్వేషంతో కోర్టులను ఆశ్రయించి తమ విలువైన సమయాన్ని వృథా చేయొద్దని కోరింది. పబ్లిక్ న్యూసెన్స్ కేసులు ఈ మధ్య ఎక్కువయ్యాయని, కొందరికి ఇలాంటి పిటిషన్లు వేయడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కొందరు అడిగారు కదా అని వెంటనే విచారణ చేపట్టలేమని హైకోర్టు ధర్మాసనం పిటిషనర్ కు స్పష్టం చేసింది. అయితే 2024 ఎన్నికలకు ముందే ఈ కేసులను విచారించాలని, వెంటనే తీర్పు వెలువరించాలని హరిరామ జోగయ్య కోరారు. అయితే ఈ పిటిషన్ పై అభ్యంతరం లేవనెత్తిన రిజిస్ట్రీ కేసు నెంబర్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఫైలింగ్ నెంబర్ పైనే విచారణ మొదలైంది. రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తిన అంశాల కాపీని పిటిషనర్ కు ఇవ్వాలని, ఆదేశిస్తూ విచారణను జూలై 6 కు వాయిదా వేసింది. ఇకపై ఇలాంటి కేసుల విషయంలో సీరియస్ గా వ్యవహరిస్తామని అందులో పేర్కొంది.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Jagan : 13న ఎన్నికల షెడ్యూల్? జగన్ నోట కూడా..

    CM Jagan : లోక్ సభతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ...

    Janasena : జనసేనలో రాజుకున్న అగ్ని

    Janasena : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన సీట్లపై భిన్న...

    CM YS Jagan : అమిత్ షాతో నేడు జగన్ కీలక భేటీ.. చంద్రబాబు అంశంపైనా చర్చ

    CM YS Jagan : ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో ఉన్నారు....