SS Rajamouli : ఒక్క సినిమాకు టోటల్ ఫ్యామిలీ పని చేస్తున్నదంటే అది రాజమౌళి ఫ్యామిలే అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో భర్తలు హీరోలు అయితే భార్యలు, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు నటులు అయితే కూతుళ్లు, కొడుకులు ఇలా ఎవరో ఒకరు ఆ సినిమాకు పని చేస్తుంటారు. కానీ ఒక్క దర్శకుడి కుటుంబం మొత్తం సినిమాకు పని చేస్తుందంటే అది రాజమౌళి ఫ్యామిలీనే.
ఒకరు డైరెక్టర్, మరొకరు మ్యూజిక్ డైరెక్టర్, కాస్టూం డిజైన్, ప్రొడక్షన్ మేనేజర్ దాదాపు సినిమాలోని ప్రతీ విభాగంలో రాజమౌళిలో ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. వారిని ఎంకరేజ్ చేయడంలో రాజమౌళి సక్సెస్ అయ్యాడనే టాక్ కూడా ఉంది. పైగా ఖర్చులు కూడా కలిసి వస్తాయి. ఇక ఇదే ఫ్యామిలీలో ఒక హీరో కూడా ఉన్నాడు అతడే శ్రీసింహా.
కీరవాణి కుమారుడు శ్రీసింహా హీరోగా కెరీర్ ప్రారంభించాడు. ‘మత్తువదలరా’ సినిమాతో హీరోగా పరిచయమైనా ఆ తర్వాత వరుస సినిమాలు తీవ్రంగా నిరాశ పరిచాయి. ‘ఉస్తాద్’గా మరో సారి తనను తాను పరీక్షించుకోనున్నాడు. ఉస్తాద్ నేడు (ఆగస్ట్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విషయంలో మేకర్స్ మంచి అంచనలతో ఉన్నారు.
ఈ సినిమాకు సంబంధించి ప్రీ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడిన విధానం చూస్తుంటే ‘శ్రీ సింహా’ను స్టార్ హీరోగా చేసే ఆలోచనలో అయితే ఉన్నారని అర్థమైంది. శ్రీసింహ కోసం త్వరలో తన డైరెక్షన్ లో సినిమా తీసే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఇక ఈ ఇంటి నుంచి కూడా స్టార్ హీరో ఇతడే అవుతాడు మరి. ఇంత పెద్ద భారీ స్కెచ్ వేసిందట జక్కన్న ఫ్యామిలీ.