39.8 C
India
Friday, May 3, 2024
More

    Ranbir Kapoor : పెళ్లికి ముందు రణబీర్ కపూర్ ఎందరితో కలిసి ఉన్నాడో తెలుసా?

    Date:

    Ranbir Kapoor
    Ranbir Kapoor and Bollywood actress

    Ranbir Kapoor Love Affairs Before Marriage : బాలీవుడ్ నటులు ఆలియా భట్, రణవీర్ కపూర్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది వీరి వివాహం జరిగింది. వారి కుటుంబ సభ్యుల మధ్య వీరి పెళ్లి ఘనంగా నిర్వహించారు. వీరి వివాహ మహోత్సవం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. పెళ్లికి ముందు రణవీర్ కపూర్ చాలా మందితో రిలేషన్ షిప్ కొనసాగించినట్లు సమాచారం.

    రణవీర్ కపూర్ పెళ్లి కంటే ముందే ప్రముఖ నటి దీపికా పడుకునేతో కొంత కాలం ప్రేమాయణం సాగించినట్లు వినికిడి. వీరిద్దరు పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వచ్చాయి. తరువాత ఎందుకో విడిపోయారు. ప్రముఖ అందాల తార కత్రినాకైఫ్ తో కూడా లవ్ రిలేషన్ కొనసాగించినట్లు తెలుస్తోంది. వీరిద్దరు కూడా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కానీ వీరు కూడా ఒక్కటి కాలేకపోయారు.

    హీరోగా రాకముందు అవంతిక మాలిక్ తో కూడా కలిసి ఉన్నాడట. తరువాత అవంతిక అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ ను పెళ్లి చేసుకుంది. సావరియా సినిమాతో సోనమ్ కపూర్, రణవీర్ కపూర్ మధ్య ప్రేమ చిగురించిందట. అప్పుడు వీరిద్దరు కూడా ప్రేమలో ఓనమాలు దిద్దారని చెబుతుంటారు. ప్రియాంక చోప్రాతో కలిసి రెండు సినిమాల్లో నటించాడు. అప్పుడు వారి మధ్య సంబంధం ఉందని పుకార్లు వచ్చాయి.

    రణవీర్ కపూర్ కంటే వయసులో పది సంవత్సరాలు పెద్దదయిన మహతానితో కూడా రిలేషన్ కొనసాగించాడని అంటారు. నర్గీస్ ఫకీతో కూడా లవ్ ఎఫైర్ కొనసాగించాడని ప్రతీతి. పాకిస్తాన్ నటి మహిరా ఖాన్ తో కూడా ప్రేమాయణం కొనసాగించాడని చెబుతుంటారు. వారి ఫొటోలు అప్పుడు వైరల్ గా మారాయి. ప్రముఖ బాలీవుడ్ నటి అమీషా పటేల్ తో కూడా ప్రేమ నడిపినట్లు సమాచారం. ఇలా రణవీర్ కపూర్ పెళ్లికి ముందు పలువురితో ప్రేమాయణం సాగించినట్లు బాలీవుడ్ కోడై కూస్తోంది.

    Share post:

    More like this
    Related

    Catherine Tresa : బికినీలో ‘ఎమ్మెల్యే’.. షాక్ అవుతున్న నెటిజన్స్!

    Catherine Tresa : ఎమ్మెల్యే బికినీలో కనిపించడం ఏంటి? అనుకుంటున్నారా. నిజమే...

    Green Nets : ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర చల్లదనానికి.. గ్రీన్ నెట్స్

    Green Nets : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకూ ఠారెత్తిస్తున్నాయి. పగటిపూట...

    Rajanna Siricilla : ఎక్సైజ్ ఎస్ఐ అనుమానాస్పద మృతి

    Rajanna siricilla : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ స్టేషన్...

    Viral Video : సైకిల్ పడేల్ వాషింగ్ మిషన్.. ఇండియన్ ఉమెనా.. మజాకా??

    Viral Video : రోజు వారి ఇంటి పనిలో బట్టలు ఉతకడం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bollywood Actress : అప్పుడు రిజెక్ట్ చేశారు.. ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నారు.

    Bollywood Actress Shilpa Shetty : సినీ పరిశ్రమ ఓ రంగుల...

    Star Director : స్టార్ డైరెక్టర్ అయితే ఏంటీ నేను అతడి సినిమాలో చేయను?

    Star Director : సినిమా రంగంలో అందివచ్చిన అవకాశాలను రెండు చేతులా...

    Hero Yash : నిర్మాతగా మారిన యష్.. దేశంలోనే భారీ ప్రాజెక్టుతో..

    Hero Yash : కన్నడ నటుడు, కేజీఎఫ్ స్టార్ యష్ ప్రొడ్యూసర్...

    OTT Movies : ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సినిమాలేంటో తెలుసా?

    OTT Movies : సినిమాలు ఇప్పుడు ఓటీటీలో తన ప్రభావం చూపిస్తున్నాయి....