
Target Pawan : పవర్ స్టార్ పవన్ కల్యాన్ జనసేన పార్టీ ప్రారంభించిప్పటి నుంచి కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అతడిని వెంటాడుతున్నాడు. తాను పవన్ కల్యాణ్ ఫ్యాన్ అంటూనే సెటెర్లు వేస్తున్నాడు వర్మ. పవన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు అన్ని అస్ర్తాలను వదులుతున్నాడు రాము. గత ఎన్నికల్లో ప్రధానంగా చంద్రబాబును టార్గెట్ చేశాడు. అప్పుడు పవన్ కల్యాణ్ ను కూడా విడిచి పెట్టలేదు. కానీ ఫోకస్ అంతా చంద్రబాబు మీదే పెట్టాడు. రానున్న ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్ కు అనుకూలంగా మరో సినిమా మొదలుపెట్టాడు. అదే వ్యూహం. అయితే ఈ సారి మాత్రం టార్గెట్ పవన్ గా కనిపిస్తున్నది.
అయితే ఈ సినిమాలో జగన్ ను హీరోగా చూపించేందుకు పవన్ ను విలన్ గా చూపించేందుకు సిద్ధమయ్యాడు. పవన్ ను ఎంత డ్యామేజ్ చేస్తే తమకు అంత లాభిస్తుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. రాంగోపాల్ వర్మ కూడా ఇదే ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు రాము అదే మిషన్‌లో ఉన్నారడు. ఇటీవల `నిజం` అనే ఓ యూ ట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. కేవలం పవన్ ను దూషించడానికే ఆ చానెల్ ను పెట్టినట్లుగా ఉందని పలువురు పేర్కొంటున్నారు.
ఇక ఇదే సమయలో `వ్యూహం` అనే ఓ సినిమా స్టార్ట్ చేశాడు. ఇందులో జగన్ ను ఎలివేట్ చేసే సన్నివేశాలు ఎక్కువట. రాజకీయాల్లో జగన్ గొప్పదనం, అమలు చేస్తున్న సంక్షే పథకాలు, జగన్ డేరింగ్ – డాషింగ్ ను తెరపై చూపించే పనిలో పడ్డాడు వర్మ. 2024 ఎన్నికలకు వైకాపాకు మద్దతుగా ఈ సినిమా ఉండేలా ప్లాన్ చేసి, తీస్తున్నారు. పేరుకు జగన్ సినిమా అయినా టార్గెట్ మాత్రం పవన్. పవన్ కి సంబంధించిన విషయాలు ఇందులో ప్రస్తావించబోతున్నట్లు తెలుస్తున్నది.
రాము గతంలోనూ పవన్ పై ఓ సినిమా తీశాడు. అందులోని నటీనటుల్లో కొంతమందిని ఈ సినిమాలోనూ మళ్లీ తీసుకోబోతున్నాడని తెలుస్తున్నది. టార్గెట్ మాత్రం పవన్‌ని సెంటర్ చేయడమే రాము వ్యూహం. అందుకోసం సోషల్ మీడియాలో వచ్చిన గాసిప్పులు, పవన్ వ్యతిరేక వర్గం చేసే ఆరోపణలు ఇందులో ప్రధానాంశాలుగా మలుస్తున్నాడని తెలుస్తున్నది. పవన్ కన్నా జగన్ బెటర్ అని ప్రజలపై రుద్ధడం వర్మ వ్యూహం. మరి ఇది ఏ మేరకు ఇటు జగన్ కు, అటు వర్మకు లాభిస్తుందో రిలీజ్ అయ్యే వరకు చూడాల్సిందే..