Shruti Haasan శృతి హాసన్.. ఈమె టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీ లలోనే కాదు.. ఇండియా మొత్తం ఫేమస్ అనే చెప్పాలి. అందాలు ఆరబోయడంలో ఎలాంటి మొహమాటం అనేది పెట్టుకోదు.. శృతి హాసన్ కెరీర్ మరోసారి ఊపందుకుంది.. మొన్నటి వరకు ఒక్క సినిమాను కూడా ఒప్పుకోకుండా చాలా గ్యాప్ ఇచ్చింది.
అయితే ఈ మధ్య మళ్ళీ వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ కెరీర్ లో జెట్ స్పీడ్ తో ముందుకు వెళుతుంది.. క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ తో సెకండ్ ఇన్నింగ్స్ ను మంచి జోష్ లో స్టార్ట్ చేయగా ఇప్పుడు కెరీర్ ఫామ్ లోకి వచ్చింది. ఈ ఏడాది అప్పుడే తన ఖాతాలో రెండు హిట్స్ వేసుకుంది.. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి వంటి రెండు హిట్స్ అందుకున్న ఈ భామ మరిన్ని అవకాశాలను అందుకుంది.
ఇదిలా ఉండగా ఈ భామ సినిమాలతో కెరీర్ ఎలా ఉన్న సోషల్ మీడియా వేదికగా మాత్రం అభిమానులను పలకరిస్తూనే ఉంటుంది.. ఇక తాజాగా ఈమె ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో చిట్ చాట్ నిర్వహించింది.. అయితే ఈ చిట్ చాట్ లో ఈమెకు ఒక నెటిజెన్ నుండి వింత ప్రశ్న ఎదురైంది.. దీంతో అతడికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
ఈమె చిట్ చాట్ లో భాగంగా ఆస్క్ మీ ఎనీథింగ్ అనే చిట్ చాట్ నిర్వహించగా ఇందులో ఆమె ఫ్యాన్స్ రకరకాల ప్రశ్నలు అడిగారు.. అందుకు ఈమె పిక్స్ పెట్టి పెట్టి సమాధానాలు చెప్పింది.. ఈ క్రమంలోనే ఈమె పాదాల పిక్ చూపించు అని అడిగారు.. దీంతో ఈమె పాదాలు మొత్తం వెంట్రుకలతో ఉన్న వింత జంతువు, ఏలియన్ వంటి కాలు ఫోటోను షేర్ చేసి అతడికి కౌంటర్ ఇచ్చింది.. దీంతో ఈమె నా పాదాలు నీకెందుకు చూపించాలని ఆ ఫొటోతో చెప్పకనే చెప్పింది..