Kollywood :
తమిళ నటులు ధనుష్, శింబు, విశాల్, అధర్వకు తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ షాక్ ఇచ్చింది. వారు చేసే తప్పులకు వారిని బాధ్యులను చేస్తూ వారిపై నిషేధం విధించింది. తేనాండాళ్ సినిమా షూటింగ్ కు రాకుండా నిర్మాతకు నష్టం కలిగించాడనే ఆరోపణలపై రజనీకాంత్ మేనల్లుడు, ప్రముఖ హీరో ధనుష్ పై అసోసియేషన్ నిషేధం విధించింది.
అసోసియేషన్ సొమ్ము పక్క దారి పట్టించాడనే ఆరోపణలపై హీరో విశాల్ పై నిషేధం విధించింది. విశాల్ పై నిషేధం ఇప్పుడు విధించలేదు. అది జరిగి చాలా రోజులవుతోంది. నిర్మాతల మండలి చైర్మన్ గా ఉన్న సమయంలోనే విశాల్ పై ఈ ఆరోపణలు వచ్చి అతడిని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కోలీవుడ్ లో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం సాధారణమే.
పలు విషయాల్లో సరైన స్పందన ఇవ్వకపోవడంతో శింబు, అధర్వపై కూడా నిషేధం విధించారు. ఇలా కోలీవుడ్ లో ప్రముఖ హీరోలపై నిషేధాజ్ణలు విధించడంతో షూటింగ్ లు ముందుకు సాగడం లేదు. వారు ఒప్పుకున్న సినిమాల పరిస్థితి గందరగోళంలో పడింది. దీంతో వారిపై నిషేధం ఎంత కాలం ఉంచుతారో తెలియడం లేదు. కానీ త్వరలో దాన్ని ఎత్తివేసే ఆలోచన ఉన్నట్లు కనిపిస్తోంది.