Dhanush : ఈ సంక్రాంతి బరిలో భారీ చిత్రాలు పోటీలో తలపడుతున్నాయి. వీటిలో మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కారం’పైనే అందరికీ ఎక్కువగా ఆశలు ఉన్నాయి. ఇదొక్కటే సూపర్ స్టార్ సినిమా కాగా, లైనప్ లో సైంధవ్, హను-మాన్, నా సామి రంగ ఉన్నాయి. వీటితో పాటు ధనుష్ నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ సహా డబ్బింగ్ సినిమాల హడావుడి కూడా ఉంది.
గ్రేడ్-ఏ మేకింగ్ వాల్యూస్ తో కూడిన ‘కెప్టెన్ మిల్లర్’ ట్రైలర్ ను ఈ రోజు (జనవరి 6) విడుదల చేశారు. యాక్షన్ షాట్స్ తో పాటు స్లీక్ విజువల్స్, విన్నింగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఉన్నాయి. ఇది సరైన మాస్ యాక్షన్ గా ఉంటుందని తెలుస్తోంది.
‘కెప్టెన్ మిల్లర్’ విలక్షణమైన సంక్రాంతి సినిమా కాకపోయినా ధనుష్ తెలుగులో స్థిరమైన మార్కెట్ ను ఏర్పరుచుకుంటున్నాడు. ఆయన గత చిత్రం ‘సర్’ తెలుగు రాష్ట్రాల్లో విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. కాబట్టి ‘కెప్టెన్ మిల్లర్’ తెలుగులో టార్గెట్ ఆడియన్స్ ని రీచ్ అయ్యే అవకాశం లేకపోలేదని సినీ అభిమానులు అంటున్నారు.
‘గుంటూరు కారం’తో పాటు ‘కెప్టెన్ మిల్లర్’ విడుదల కావడం ఇక్కడ విశేషం. జనవరి 12న మహేష్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ విన్నింగ్ ట్రైలర్ ఖచ్చితంగా సినిమాకు అనుకూలంగా పనిచేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు దొరకని కారణంగా తమిళ వెర్షన్ – జనవరి 12న కెప్టెన్ మిల్లర్ తెలుగులో విడుదల కాకపోవచ్చునని వార్తలు వస్తున్నాయి. కానీ నిర్మాతలు మాత్రం రెండు భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని పట్టుబడుతున్నారు. ఏదేమైనా కెప్టెన్ మిల్లర్ ఈ సంక్రాంతికి ఒక వర్గం ప్రేక్షకులకు మంచి ఛాయిస్ కాగలదని సినీ లవర్స్ అభిప్రాయం.