CM YS.Jagan: ఏపీ సీఎం జగన్, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో ధూషించిన స్వాతిరెడ్డిని వైసీపీ సానుభూమితి పరులు, వైసీపీ సోషల్ మీడియా వింగ్ తెగ ట్రోల్ చేస్తున్నారు. విపరీతంగా షేర్ చేస్తూ, వీడియోలను ఎడిట్ చేసి మరీ ఆడుకుంటున్నారు. ఈ ఉచ్చులోకి ఎందుకు వచ్చాం రా నాయనా అనేలా ఉంది ప్రస్తుతం ఆమె పరిస్థితి.
అబ్రాడ్ లో ఉంటున్న స్వాతిరెడ్డి చాలా రోజులుగా వైసీపీ అధినేత జగన్, ఆయన కుటుంబ సభ్యులపై విపరీతంగా కామెంట్లు చేస్తూ పోస్ట్ లు పెడుతుంది. దీనిపై చాలా సార్లు సైలెంట్ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ సానుభూతి పరులు అయినా ఆమెలో మార్పు రాకపోవడంతో వీరు కూడా ప్రతి దాడి చేయడం మొదలు పెట్టారు. ఆమెతో మాట్లాడిన వీడియోను సంపాదించి ‘పెళ్లాం ఊరెళ్లితే..’ సినిమాలోని సన్నివేశాలను యాడ్ చేసి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో స్వాతిరెడ్డి తలపట్టుకోవాల్సి వస్తుంది.
ఆమెపై వైసీపీ దాడుల నేపథ్యంలో బాధపడుతున్న ఆమెను చంద్రబాబు ఓదార్చారు. ఇక వైసీపీకి మరో కొబ్బరి ముక్క దొరికింది. బాబు, లోకేశ్ కావాలనే ఆమెకు డబ్బులిచ్చి మరీ ఇలాంటి పోస్టులు పెట్టిస్తున్నారని వైసీపీ భగ్గుమంది. బాబుకు ఇదేం పోయే కాలం తన భార్యను ఒక్క మాట అంటే ఏడ్చేసిన ఆయన ఇంకో కుటుంబంపై ధూషణలు చేయాలని డబ్బులిచ్చి మరీ మేపుతున్నారా..? అంటూ కామెంట్లు కూడా వినిపించాయి.
ఈ ట్రోలింగ్ వీడియో ఆసాంతం నవ్వులు పూయిస్తుంది. ఇందులోనే స్వాతిరెడ్డిపై తీవ్రంగా కామెంట్లు కూడా దాగున్నట్లు కనిపిస్తుంది. పెళ్లాం ఊరెళ్లితే సినిమాలో నటి జ్యోతిని వేణు తొట్టెంపుడిని దంపతులుగా చేసి బెస్ట్ కపుల్ షో నిర్వహిస్తారు. ఇందులో ఆమె అడిగిన ప్రశ్నలను స్వాతిరెడ్డికి అన్వయించి సంధించారు. ఏమి మాట్లాడాలో తెలియక అల్లాడిపోయింది స్వాతిరెడ్డి.
They are playing Swathi Reddy who insulted Jagan Tweet Viral