31.3 C
India
Wednesday, June 26, 2024
More

    Ex-Minister Botsa Satya Narayana : ఆ జిల్లా క్లీన్ స్వీప్ చేయబోతున్నాం మాజీ మంత్రి బొత్స విశ్వాసం

    Date:

    Ex-Minister Botsa Satya Narayana
    Ex-Minister Botsa Satya Narayana

    Ex-Minister Botsa Satya Narayana : ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత అనేక చోట్ల అల్లర్లు జరిగాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈసీ సీరియస్ కావడంతో దాదాపు కొన్ని వందల మందిపై కేసులు నమోదు అయ్యాయి.

    ఈవీఎంలు విధ్వంసం చేసిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై ఈసీ కేసు నమోదు చేసింది.  అయితే  దీనిపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎనిమిది తొమ్మిది చోట్ల ఘటనలు జరిగితే కేవలం ఒక్క చోట మాత్రమే కేసు నమోదు చేయడం వెనక ఈసీకి ఉన్న కష్టం ఏమిటో అర్థం కావడం లేదన్నాడు. పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలకు కారణం చంద్రబాబే అని మండిపడ్డాడు.

    పల్నాడు జిల్లాలో అనేక హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిన్నింటిపై విచారణ జరగాలి. కానీ ఒక్క చోట జరిగిన దాన్ని మాత్రమే పట్టుకుని మాట్లాడటం సబబు కాదన్నాడు. విజయనగరం జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలు, ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని మాజీ మంత్రి బొత్స విశ్వాసం వ్యక్తం చేశాడు. రాబోయే జూన్ 4 వ తేదీన మరోసారి జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాడని జోస్యం చెప్పాడు.

    అయితే టీడీపీ కూటమి చేసిన అరాచకాలను ప్రశ్నించారు.  ఎన్నికలు ముగిసిన తర్వాత విధ్వంసానికి కారణం టీడీపీ నాయకుడు చంద్రబాబు అని ఆరోపించారు. జూన్ 4 వ తేదీన వచ్చే ఫలితాలు టీడీపీకి చెంప పెట్టు లాంటివి కాబోతున్నాయన్నారు. ఇదిలా ఉండగా.. టీడీపీ కూటమి కచ్చితంగా గెలవబోతుందని కొన్ని మీడియా సంస్థల్లో డిబెట్ లలో చర్చలు కొనసాగుతున్నాయి. బొత్స నమ్మకం నిజమవుతుందా.. లేదా అనేది జూన్ 4 వ తేదీన తేలిపోనుంది. ఓంటరి పోరులో వైసీపీ గెలిస్తే మాత్రం జగన్ కు మరో అయిదేళ్లు తిరుగుండదు.

    Share post:

    More like this
    Related

    Cheetah : శంషాబాద్ లో చిరుత సంచారం.. సీసీ కెమెరాలతో నిఘా

    Cheetah : హైదరాబాద్ లోని శంషాబాద్ లో చిరుత సంచారం కలకలం...

    Aarogyasri Card : ఏపీ లో ఆరోగ్య శ్రీ కార్డుపై కీలక అప్‌డేట్

    Aarogyasri Card Update : సీఎం క్యాంపు ఆఫీస్ (సీఎంసీఓ) పేరుతో...

    Kalki 2898 AD : ఆ ముగ్గురిదే సినిమా అంతా..

    Kalki 2898 AD : బాహుబలి సిరీస్ తర్వాత  హిట్టు ఫ్లాపులతో...

    America : అమెరికాలో కాల్పులు.. ఐదుగురు మృతి

    America : అమెరికా లాస్ వెగాస్ లో ఓ అపార్ట్ మెంట్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagan Tweet : వైసీపీ కార్యాలయాన్ని కూల్చేయడంపై జగన్ ట్వీట్

    Jagan Tweet : తాడేపల్లిలో వైసీపీ కార్యాలయాన్ని కూల్చేయడంపై వైఎస్ జగన్...

    CM Chandrababu : యువతి హత్య ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్

    CM Chandrababu : బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో యువతి...

    Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు

    Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నానిపై వాలంటీర్ల ఫిర్యాదు...