జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు జవాన్లు మరణించగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. జవాన్లను తీసుకొస్తున్న బస్సు బ్రేక్ ఫెయిలై నదిలో పడిపోయింది. దాంతో అందులో ప్రయాణిస్తున్న 39 మంది జవాన్ల లో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. గాయపడిన వాళ్ళను ఆసుపత్రికి తరలించారు. అమర్ నాథ్ యాత్ర కు భద్రత కల్పించే భద్రతా సిబ్బంది ప్రమాదానికి గురి కావడంతో తీవ్ర విచారం వెలిబుచ్చారు. ఈ సంఘటన పై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Breaking News