దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. 28 సంవత్సరాల అఫ్తాబ్ కు 26 ఏళ్ల శ్రద్దాతో పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఇద్దరి మతాలు వేరు కావడంతో శ్రద్దా పేరెంట్స్ వాళ్ళ పెళ్లికి ఒప్పుకోలేదు. ఇంకేముంది ఈ పెద్దలు ఇంతేలే అని ముంబై నుండి ఢిల్లీకి మకాం మార్చి అక్కడ ఓ అపార్ట్ మెంట్ లో సహజీవనం చేసారు.
అయితే నెలలు గడుస్తున్నప్పటికీ అఫ్తాబ్ పెళ్ళికి వాయిదాల మీద వాయిదాలు వేస్తుండటంతో శ్రద్దా పెళ్లి చేసుకోవాల్సిందే అని ఒత్తిడి చేసింది. దాంతో ఆమె అడ్డు తొలగించుకోవాలి అని భావించిన హంతకుడు శ్రద్దా గొంతు కోసి హత్య చేసాడు. అనంతరం ఆమెను 35 ముక్కలుగా కోసి కొత్త ఫ్రిడ్జి కొని అందులో ఆమె శరీర భాగాలను పెట్టాడు. చుట్టుపక్కల వాళ్లకు వాసన రాకుండా అగర్ బత్తీలతో పాటుగా సెంట్ కొట్టాడు.
అలాగే కొన్ని శరీర భాగాలను ఢిల్లీ సరిహద్దులలో పడేసాడు. అయితే శ్రద్దా పేరెంట్స్ కోపం కాస్త తగ్గిన తర్వాత ఆమెకు ఫోన్ చేస్తుండటంతో ఆమె ఫోన్ స్విచాఫ్ రావడంతో ఢిల్లీకి చేరుకున్నారు. వివరాలు సేకరించే క్రమంలో పలు అనుమానాలు తలెత్తడంతో పోలీసులను ఆశ్రయించారు. అఫ్తాబ్ పై ఫిర్యాదు చేయడంతో అతడ్ని అరెస్ట్ చేస్తే శ్రద్దా ను ఆరు నెలల కిందటే చంపిన విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో నివ్వెరపోవడం పోలీసుల వంతు అయ్యింది.