Farmers Protest : రైతు సంఘాలు, కేంద్రం మధ్య సుదీర్ఘంగా సాగిన మూడో దఫా చర్చలు విఫలం అయ్యాయి. పంట లకు మద్దతు ధరకు చట్టబద్దత సహా పలు డిమాం డ్లపై ఏకాభిప్రాయం కుదరలేదు. చర్చలకు మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. ఆదివారం రైతు సంఘాలతో నాల్గోసారి కేంద్రం చర్చలు జరపనుంది. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విరమించేది లేదని రైతు సంఘాలు స్పష్టం చేశాయి.
పంటలకు మద్దతు ధరకు చట్టబద్దత సహా పలు డిమాండ్లపై ఏకాభిప్రాయం కుదరక పోవడం వల్ల రైతులు ఆందోళన ను విరమించడం కుదరదని తెగేసి చెప్పారు. ఎన్నికల సమయం లో రైతులు ఆందోళన బాట పట్టడం తో కేంద్రానికి ఏమి చెయ్యాలో దిక్కు తోచడం లేదని చెప్పవచ్చు.