
అబార్షన్ లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. పెళ్లితో సంబంధం లేకుండా వివాహితులు , లేదా అవివాహితలు గర్భం ఇష్టం లేకపోతే 24 వారాల్లోగా సురక్షిత అబార్షన్ చేయించుకోవచ్చని సంచలన ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం ఆదేశాలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.
పెళ్లి అయినవాళ్లు అలాగే పెళ్లి కాని వాళ్ళు గర్భం దాల్చితే ఇన్నాళ్లు ఆ గర్భస్రావం చేయాలంటే రకరకాల అనుమతులు ఉండేవి. కానీ తాజా తీర్పుతో ఎలాంటి అనుమతులు లేకుండా చేసింది సుప్రీం కోర్టు. భర్త భార్యను బలవంతం చేసి గర్భం వచ్చేలా చేస్తే ….. అది ఆమెకు నచ్చకపోతే కూడా అబార్షన్ చేయించుకోవచ్చని ,దీనికి భర్త అనుమతి అవసరం లేదని కుండబద్దలు కొట్టింది సుప్రీం కోర్టు. ఇక ఎక్కువ మంది సహజీవనం చేస్తూ అలాగే ప్రేమలో పడుతూ గర్భవతులు అవుతున్నారు. తీరా సమయానికి పెళ్లి కాకపోవడంతో అలాంటి వాళ్ళు అబార్షన్ చేయించుకునే వెసులుబాటు కల్పించింది సుప్రీం కోర్టు.