38 C
India
Friday, April 26, 2024
More

    Bad Breath : నోటి దుర్వాసనను దూరం చేసే చిట్కా ఇదే..

    Date:

    Bad Breath
    Bad Breath

    Bad Breath : నోటి దుర్వాసన చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. నలుగురిలోకి వెళ్లాలంటే జంకుతారు. ఎక్కడ తమ నోటి నుంచి వాసన వస్తుందోనని నోరు విప్పరు. రోగాన్ని దాచుకుంటే ఏం లాభం. దాన్ని పరిష్కరించుకోవాలి. నోటి దుర్వాసనను సులభంగా దూరం చేసుకోవచ్చు. దానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. దీంతో ఈ సమస్య నుంచి దూరం కావాలంటే ఓ సులభమైన పరిష్కార మార్గం ఉంది.

    అందరు ఉదయం లేవగానే కాఫీ, టీలు పళ్లు తోముకోకుండానే తాగేస్తుంటారు. ఇది కరెక్టు కాదు. పళ్లు తోమకుండా కాఫీ, టీ తాగితే చెడు బ్యాక్టీరియా చేరుతుంది. ఫలితంగా నోటి దుర్వాసన ఎక్కువవుతుంది. కానీ మనం పట్టించుకోం. దంతాలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. వాటికి ఇబ్బందులు వస్తే పాడైపోవడం ఖాయం. అందుకే వాటిని కాపాడుకోవాలి.

    మనం రోజు భోజనం చేస్తుంటాం. భోజనం చివర్లో పెరుగు వేసుకుని రెండు ముద్దలు తింటే నోటి దుర్వాసన దూరమవుతుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇంకా భోజనం తరువాత ఓ అర గంట ఆగి గ్రీన్ టీ తాగితే ఎంతో లాభం ఉంటుంది. నోట దుర్వాసన లేకుండా పోతుంది. ఇలా సింపుల్ చిట్కా కావడంతో దీన్ని ఉపయోగించుకుని నోటి దుర్వాసన నుంచి బయట పడొచ్చు.

    విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు తీసుకుంటే మంచిది. నారింజ, కివి, స్ట్రాబెర్రీ, పైనాపిల్ వంటి పండ్లను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన రాదు. దంతాలకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి. చిగుళ్లు, దంతాలు బలంగా మారుతాయి. ఇలాంటి చిట్కాలు ఉపయోగించుకుని నోటిదుర్వాసనను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు.

    Share post:

    More like this
    Related

    Chennai : చేపల వలలో కాసులు.. ఎక్కడి నుంచి వచ్చాయంటే?

    Chennai : చేపలు చిక్కుతాయని జాలారి వల వేస్తే వలకు కోట్లు...

    Twins Inter Results : ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ – తిమ్మాపూర్ గురుకుల కళాశాల విద్యార్థుల సత్తా

    Twins Inter Results : ఇంటర్మీడియేట్ ఫలితాల్లో గురుకుల కళాశాల లో...

    BRS-Congress : బీఆర్ఎస్ దారిలో కాంగ్రెస్

    BRS-Congress : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ...

    Pawan Kalyan : అధికారం వద్దు… సినిమానే ముద్దంటున్న పవన్ కళ్యాణ్

    Pawan Kalyan : భారతీయ జనతా పార్టీ,తెలుగు దేశం పార్టీ, జనసేన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    నోటి దుర్వాసనను దూరం చేసుకునే చిట్కాలేంటో తెలుసా?

    మనలో చాలా మంది నోటి దుర్వాసనతో బాధపడుతున్నారు. దీంతో వారు నలుగురిలో...