
స్వర్గీయ ఎస్పీ బాలుకు ఘన నివాళి అర్పించాలని భావించిన కళావేదిక మరియు నార్త్ అమెరికన్ సీమాంధ్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలు వర్ధంతి కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎడిసన్ లోని రాయల్ గ్రాండ్ మ్యానర్ లో నిర్వహించారు. ఇక ఎంట్రీ టికెట్ ధర 35 డాలర్లుగా నిర్ణయించారు. ఈ కార్యక్రమం స్వాతి అట్లూరి ( అధ్యక్షురాలు ) ఉష ( కార్యదర్శి) నేతృత్వంలో జరిగింది. శ్రీమతి ఉష గాయనిగా సుపరిచితులు అనే విషయం తెలిసిందే. తెలుగులో పలు చిత్రాల్లో అద్భుతమైన పాటలను ఆలపించారు.
దాంతో ఇదే వేదికపై ఉష అద్భుతమైన బాలు పాటలను పాడి ఆహూతులను అలరించారు. బాలుతో కలిసి ఎన్నో మధురమైన పాటలను పాడారు ఉష. దాంతో బాలు గారితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జగదీష్ యలమంచిలితో పాటుగా పెద్ద ఎత్తున తెలుగువాళ్లు పాల్గొన్నారు.
ఫోటోలు: డాక్టర్ శివకుమార్ ఆనంద్