
అమెరికాలోని చారిత్రాత్మక నగరమైన అట్లాంటాలో కూడా పెద్ద ఎత్తున తెలుగువాళ్లు ఉంటున్న విషయం తెలిసిందే. అక్కడి తెలుగువాళ్లంతా కలిసి ఏర్పాటు చేసుకున్న సంస్థ ” Telugu Association of Metro Atlanta ” ( తామా ). తాజాగా తామా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అలాగే దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు.
చిన్నారులు , పెద్దలు , మహిళలు మొత్తంగా 1200 మందికి పైగా ఈ వేడుకలలో పాల్గొన్నారు. చిన్నారులు , మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఖండాంతరాలను దాటినప్పటికీ బతుకమ్మ వేడుకలను మాత్రం అంగరంగ వైభవంగా నిర్వహిస్తూనే ఉన్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ సందడి చేసారు. తామా ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. సునీత పొట్నూరు , రవి కల్లి , శ్రీరామ్ రొయ్యల , సాహిత్య వింజమూరి , శ్రీవల్లి శ్రీధర్ , తదితరులతో పాటుగా వందలాది మంది ఈ వేడుకలలో పాల్గొన్నారు.