34.7 C
India
Friday, April 10, 2026
More

    Harish Rao: కేంద్రాన్ని లేఖ‌ల‌తో భయపెడుతున్న హ‌రీశ్

    Date:

    Harish Rao
    Harish Rao

    Harish Rao: బీఆర్ఎస్‌కు అధికారిక బాస్ కేసీఆర‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే ఆ పార్టీకి కేసీఆరే బాస్ అయిన‌ప్ప‌టికీ..వ్య‌వ‌హారాల‌న్ని కేటీఆరే చూసుకోవ‌డం ప‌రిపాటి. అన్ని మంత్రి ప‌ద‌వుల్లో ఆయ‌న వేలు పెట్ట‌డం ఆన‌వాయితీగా మారింది. ఇక కేటీఆర్ రాష్ట్ర స‌ర్కార్ వ్య‌వ‌హారాల‌పైనే కాకుండా తెలంగాణ‌కు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు,ప్రాజెక్టులు,వ‌ర్క్స్ వంటి వాటిపై కూడా త‌రుచు సెంట‌ర్‌కు లేఖ‌లు రాస్తుంటారు.

    అయితే కేంద్రానికి ఎప్పుడు లేఖ‌లు రాసే కేటీఆర్ ఈ మ‌ధ్య సైలెంట్ అయ్యారు. కొంత‌కాలంగా సెంట‌ర్ కు లేఖ‌లు రాయ‌డం మానేశారు. ఈ నేప‌థ్యంలోనే తానేమీ త‌క్కువ‌నా అన్న‌ట్లు హ‌రీశ్ రావు ఆ బాధ్య‌త‌లు తీసుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ మ‌ధ్యన‌ కేటీఆర్ మాదిరే హ‌రీశ్ కేంద్రానికి లేఖ‌లు రాయ‌డం మొద‌లెట్టారు. కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల స‌మ‌స్య‌ల‌ను అడ్రెస్ చేస్తూ..హ‌రీశ్ కేంద్రానికి లేఖ‌లు రాస్తున్నారు.

    సంగారెడ్డి జిల్లా ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీకి కొంత కాలంగా ఆర్డ‌ర్లు లేవు. దీంతో అందులో ప‌ని చేసే ఉద్యోగులు ఎక్క‌డ ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీ ప్రైవేట్ ప‌రం అవుతుందోన‌ని ఆందోళ‌న చెందుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే వారంతా ఇటీవ‌ల రాష్ట్ర మంత్రి హ‌రీశ్ రావును క‌లిసి త‌మ గోడును వెల్ల‌బోసుకున్నారు. దీంతో హ‌రీశ్ రావు ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ల‌కుండా ఆయ‌నే నేరుగా కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు లేఖ‌ రాశారు. సంగారెడ్డి ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీ స‌మ‌స్య‌ను ప‌రిష్కారించాల‌ని లేఖ‌లో ప్ర‌స్తావిం చారు.

    అయితే విష‌యాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళితే అది కాస్తా త‌ప్ప‌కుండా కేటీఆర్ దృష్టికి వెళ్లే అవ‌కాశ‌ముంద‌ని,అందువ‌ల్ల తానే ముందే లేఖ రాయ‌డం ద్వారా స‌మ‌స్య‌పై స్పందించిన‌ట్ల‌వుతుంద‌నే హ‌రీశ్ రావు ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే హ‌రీశ్ తీసుకున్న డిసిష‌న్ సంగ‌తేలా ఉన్నా..ఆయ‌న మ్యాట‌ర్ ఉంటే త‌ప్ప దెంట్లో వేలు పెట్ట‌డ‌నే టాక్ ఉంది. ఈనేప‌థ్యం లోనే ఆయ‌న రాసిన లేఖ ద్వారా తెలంగాణ‌కు బీజేపీ అన్యాయం చేస్తోంద‌నే సంకేతాలు పంపించారు. దీంతో హ‌రీశ్ ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీ స‌మ‌స్య‌పైనే కాకుండా ఇక ముందు ఇంకేం లేఖ‌లు రాస్తారోన‌నే భ‌యం సెంట‌ర్‌లో మొద‌లైందంటా..!

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Harish Rao : స్పీకర్ ను నిలదీసిన హరీష్ రావు.. వైరల్ వీడియో

    Harish Rao : బుద్దిమాంద్యం అంటూ తెలంగాణ అసెంబ్లీ సభలో మాట్లాడిన బీఆర్ఎస్...

    Harish Rao : ప్రయాగ్ రాజ్ లో నదీస్నానం చేసిన హరీశ్ రావు దంపతులు

    Harish Rao : హరీశ్ రావు దంపతులు మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగ్ రాజ్‌లో...

    Harish Rao : మూసీ సుందరీకరణ పేరిట ‘రియల్’ వ్యాపారం: హరీశ్ రావు

    Harish Rao : మూసీ సుందరీకరణ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం...

    KCR : సార్లంతా ఫుల్ బిజీ.. ‘కారు’ స్టీరింగ్ పట్టేవారేరి?

    KCR  : ఒక ఉద్యమ నేతగా, తెలంగాణ రాష్ట్ర సాధన కర్తగా...