
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మహమ్మద్ అజారుద్దీన్ కు షాక్ ఇచ్చింది. అజారుద్దీన్ నేతృత్వంలోని HCA ( హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ) ను రద్దు చేస్తున్నట్లుగా సంచలన తీర్పు వెలువరించింది. జస్టిస్ నాగేశ్వరరావు నేతృత్వంలోని ఏకసభ్య కమీషన్ ఆధ్వర్యంలో HCA కొత్త కమిటీ కోసం ఎన్నికలు జరుగుతాయని , అందుకు HCA కార్యవర్గం సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది.
గతకొంత కాలంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. అజారుద్దీన్ పలు అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపణలు చేస్తున్నారు మిగతా కార్యవర్గ సభ్యులు. ఇక ఇటీవల కాలంలో హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం లో జరిగిన రెండు మ్యాచ్ ల విషయంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.