love affair స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కోలీవుడ్ లో ఇప్పుడు టాప్ లో ఉన్నారు.. ఈయన తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ అందించి స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.. ఇప్పుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా వెలుగొందుతున్న అనిరుద్ రవిచంద్రన్ ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.. అది కూడా ఒక స్టార్ సింగర్ తో అని టాక్..
కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం.. అనిరుద్ రవిచంద్రన్ లవ్ లో ఉన్నట్టు టాక్.. తమిళ్ లో చిన్న వయసులోనే కెరీర్ ను స్టార్ట్ చేసి కొలవెరీ సాంగ్ తో తమిళ్ లో సెన్సేషనల్ క్రియేట్ చేసాడు.. ఈ సాంగ్ తర్వాతనే ఈయన వరుస ఆఫర్స్ అందుకుని కోలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు.. సీనియర్ డైరెక్టర్లకే గట్టి పోటీ ఇచ్చి వారిని రేసులో వెనక్కి నెట్టేశాడు.
చిన్న వయసులోనే ఈయన సెన్సేషనల్ క్రియేట్ చేసి తన మార్క్ చూపించాడు.. తెలుగులో కూడా అనిరుద్ ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ కూడా అజ్ఞాతవాసి సినీరంతో తన మార్క్ చూపించి ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాలకు మ్యూజిక్ ఇచ్చుకుంటూ పోతున్నాడు.. అయితే ఇతడు పర్సనల్ లైఫ్ లో ఇప్పటి వరకు చాలా మంది అనిరుద్ రవిచంద్రన్ తో లవ్ ఎఫైర్స్ ఉన్నట్టు పేర్లు బయటకు వచ్చాయి..
ఇక తాజాగా ప్రముఖ సింగర్ జోనితా గాంధీతో అనిరుద్ లవ్ ఎఫైర్ నడిపిస్తున్నట్టు కోలీవుడ్ మీడియా కోడై కూసింది. ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది. బీస్ట్ సినిమాలో అరబిక్ కుత్తు సాంగ్ పాడి ఈ సింగర్ ఫేమస్ అయ్యింది. ఈ భామతో ఇతడి లవ్ వ్యవహారం కమల్ విక్రమ్ సినిమాతో స్టార్ట్ అయ్యిందని టాక్.. ఆ సినిమా తర్వాత నుండి వీరు ఇద్దరు కలిసి తిరగడం స్టార్ట్ చేశారట..
కోలీవుడ్ మీడియాలో ఈ న్యూస్ చక్కర్లు కొడుతోంది.. వీరు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని త్వరలో పెళ్లి కూడా చేసుకుంటున్నారు అంటూ వార్తలు వస్తుండడంతో ఈ విషయంపై ఈ ఇద్దరు ఖండించలేదు. దాంతో అందరి అనుమానం బలపడుతుంది.. మరి వీరి లవ్ వ్యవహారం ఎప్పుడు బయట పడుతుందో వేచి చూడాల్సిందే..