నయనతార సరోగసీ వివాదం నుండి బయటపడింది. తమిళనాడు ప్రభుత్వం నియమించిన కమిటీ నయనతార – విఘ్నేష్ శివన్ లకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇటీవల నయనతార – విఘ్నేష్ శివన్ లు సరోగసీ విధానం ద్వారా తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు నయన్ – విఘ్నేష్ లు.
అయితే నయనతార – విఘ్నేష్ శివన్ లు ఈ ఏడాది జూన్ లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని నాలుగు నెలలు కాకుండానే ఎలా తల్లిదండ్రులు అయ్యారంటూ పెద్ద వివాదమే అయ్యింది. అయితే వాళ్ళు జనవరిలోనే సరోగసీ ద్వారా పేరెంట్స్ కావడానికి నిర్ణయించుకున్నారు. అంతకంటే ముందే అంటే 2021 లోనే ఇందుకు సంబంధించి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఆ అగ్రిమెంట్ తాలూకు డాక్యుమెంట్స్ తో పాటుగా ఆరేళ్ళ క్రితమే పెళ్లి చేసుకున్న డాక్యుమెంట్స్ కూడా కమిటీకి ఇచ్చారు.
దాంతో అన్నీ పరిశీలించిన మీదట సరైన పద్దతిలోనే సరోగసీ ద్వారా పేరెంట్స్ అయ్యారని నివేదిక ఇచ్చారు. దాంతో వివాదం ముగిసినట్లే అని చెప్పాలి. నయనతార దక్షిణ భారతదేశంలో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.