మానవత్వానికి మారుపేరుగా నిలిచిన వ్యక్తి ,శక్తి సోనూ సూద్. తెరమీద కరడుగట్టిన ప్రతినాయకుడిగా నటించి ప్రేక్షకులను భయపెట్టిన ఈ నటుడు 2020 లో కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేయడంతో ఒక్కసారిగా హీరోగా అవతరించాడు. తెరమీద విలన్ పాత్రలు పోషించినప్పటికీ మంచి మనసున్న నిజమైన హీరో అని యావత్ ప్రపంచం చేత పిలుపించుకున్నాడు.
వేలాది మంది వలస కార్మికులను స్వగ్రామాలకు చేర్చడంలో , వాళ్లకు తన స్టార్ హోటల్ లో ఆశ్రయం ఇవ్వడంలో ఎక్కడా తగ్గలేదు. దానంలో అభినవ దాన కర్ణుడిగా అవతరించాడు. ఇక గత ఏడాది అంటే 2022 లో ఎంతమందిని సోనూ సూద్ ఆదుకున్నాడో తెలుసా ? 10,117 మందిని ఆదుకున్నాడు. ఎందరికో కొత్త జీవితాన్ని అందించాడు.
అయితే ఇంతమందిని ఆదుకోవడం అంటే మాటలు కాదు ! అయినప్పటికీ నన్ను చాలామంది ఆదుకోవాలని సహాయం కోసం అర్ధించారు …… అయితే నేను 10,117మందికి మాత్రమే చేయగలిగాను. మిగతా వాళ్లకు చేయలేకపోయాను ……. అందుకు నన్ను క్షమించండి అంటూ తన మంచి మనసును మరోసారి చాటుకున్నాడు సోనూ సూద్. సహాయం చేయమని దేశ వ్యాప్తంగా సోనూ సూద్ ను ఇప్పటికీ అడుగుతూనే ఉన్నారు. అయితే తన శక్తికి మించే పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేసాడు. ప్రాణాలను నిలబెట్టడమే కాకుండా పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించాడు సోనూ సూద్.