ప్రముఖ పారిశ్రామిక వేత్త డాక్టర్ జగదీశ్ యలమంచిలి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. కృష్ణా జిల్లా కుర్రోడు జగదీశ్ యలమంచిలికి చిన్నప్పటి నుండే సినిమాలంటే చాలా చాలా ఇష్టం. సూపర్ స్టార్ కృష్ణ కు వీరాభిమాని. సూపర్ స్టార్ కృష్ణ అభిమాన సంఘం కృష్ణా జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేసారు. అయితే సినిమాల మీద ఎంతగా అభిమానం ఉన్నప్పటికీ చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు.
ఉన్నత చదువులు చదివి అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడ్డారు. పలు సంస్థలు స్థాపించి పారిశ్రామికవేత్తగా అవతరించారు. వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాగే రక్త కొరతతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని భావించి అందుకొసం ” U Blood App ” ను సృష్టించారు. ఈ యాప్ సర్వరోగ నివారిణి లాంటిది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇందులో ఒక్కసారి తమ వివరాలను పొందుపరిస్తే రక్తదాతల వివరాలతో పాటుగా రక్త గ్రహీతల వివరాలు కూడా ఉంటాయి. దాంతో రక్తదాతలకు రక్తగ్రహీతలకు అనుసంధానంగా నిలిచింది యు బ్లడ్ యాప్. ఇక ఈ యాప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ నటులు సోనూ సూద్ వ్యవహరిస్తున్నారు.
ఇక సినిమా రంగం విషయానికి వస్తే ……. డాక్టర్ జగదీశ్ యలమంచిలికి సినిమాలంటే ప్రాణం….. దాంతో సినిమా రంగ ప్రవేశం చేస్తున్నారు. తన ఎదుగుదలకు , ఈరోజు ఇంతటి అత్యున్నత స్థాయిలో ఉండటానికి కారకుడైన తన తండ్రి యలమంచిలి కృష్ణమూర్తి పేరునే నిర్మాతగా వేస్తూ చిత్ర నిర్మాణానికి పూనుకున్నారు డాక్టర్ జై యలమంచిలి. యంగ్ హీరో త్రిగున్ హీరోగా ” అవసరానికో అబద్దం ” అనే విభిన్న కథా చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో సినీ రంగ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా ప్రారంభం అయ్యింది. ఈ సందర్బంగా పలువురు సినీ ప్రముఖులు కృష్ణమూర్తి యలమంచిలి, డాక్టర్ జై యలమంచిలిని అభినందించారు……. సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.