సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య అల్లుడు ధనుష్ విడిపోయారన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ధనుష్ – ఐశ్వర్య లు విడాకులను రద్దు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. 18 సంవత్సరాల కాపురంలో ఇద్దరు అబ్బాయిలకు జన్మనిచ్చారు ధనుష్ – ఐశ్వర్యలు. అయితే మధ్య మధ్యలో కాస్త గొడవలు ఉన్నప్పటికీ ఈ ఏడాది ప్రారంభంలో మేము విడిపోతున్నామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించి సంచలనం సృష్టించారు ఐశ్వర్య – ధనుష్.
అయితే ఐశ్వర్య – ధనుష్ ల విడాకుల ప్రకటన రజనీకాంత్ ను తీవ్రంగా కలిచి వేసింది. దాంతో ఇద్దరినీ కలపడానికి చాలా ప్రయత్నాలే చేసాడట. అలాగే ధనుష్ తండ్రి కూడా విడాకులకు ఒప్పుకోలేదు. సర్దుబాటు చేసుకోండి అంటూ ఒత్తిడి చేసాడు. ఇరు కుటుంబాల ఒత్తిడి ఫలితమో లేక పిల్లల భవిష్యత్ కోసమో కానీ ఐశ్వర్య – ధనుష్ ల మధ్య కోపం తగ్గిందట.
ఆలోచనలో పడ్డారట ! దాంతో చర్చలు జరిగాయి …….. విడాకులను రద్దు చేసుకోవాలి అని నిర్ణయించుకున్నారట. ఇక ఈ ఇద్దరూ మళ్ళీ కలుసుకున్నట్లే అని అంటోంది తమిళ మీడియా. భార్యాభర్తలు అన్నాక తప్పకుండా పొరపొచ్చాలు ఉంటాయి . అంతమాత్రాన విడిపోతారా ? అడ్జెస్ట్ చేసుకోండి అంటూ బంధుమిత్రులు కూడా సలహాలు ఇచ్చారట. నిజంగా ఇది జరిగితే మంచిదేగా ……. !