35 C
India
Saturday, May 4, 2024
More

    KING OF KOTHA REVIEW : ”కింగ్ ఆఫ్ కోత’ రివ్యూ అండ్ రేటింగ్..

    Date:

    KING OF KOTHA REVIEW :

    దుల్కర్ సల్మాన్ పేరు ఇప్పుడు పాన్ ఇండియా వ్యాప్తంగా సుపరిచితమే.. దుల్కర్ సల్మాన్ మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడు అయినప్పటికీ తన సొంత టాలెంట్ తో స్వతహాగా ఎదిగి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు. సీతారామం సినిమాతో గత ఏడాది వచ్చి ఇండియా వైడ్ గా మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. మరి తాజాగా దుల్కర్ సల్మాన్ నటించిన ‘కింగ్ ఆఫ్ కోత’ రిలీజ్ అయ్యింది. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పాన్ ఇండియన్ సినిమా రివ్యూ ఒకసారి చూద్దాం..

    నటీనటులు :

    దుల్కర్ సల్మాన్
    ఐశ్వర్య లక్ష్మి
    నైలా ఉష
    అనిఖా సురేంద్రన్
    డాన్స్ రోజ్ షబీర్

    డైరెక్టర్ : అభిలాష్ జోషి

    నిర్మాత : జీ స్టూడియోస్, దుల్కర్ సల్మాన్

    మ్యూజిక్ డైరెక్టర్ : జెక్స్ బిజోయ్

    కథ :

    1980 కాలం నాటి కథను డైరెక్టర్ తీసుకున్నాడు.. రాజు (దుల్కర్ సల్మాన్ ) ఫుట్ బాల్ ప్లేయర్.. అనుకోని కారణాల వల్ల ఇతడు కొన్ని సమస్యలను ఎదుర్కొంటాడు.. ఈ సమస్యలను పరిష్కరించుకునే క్రమంలో ఊరిని ఏలే నాయకుడిగా మారుతాడు. మరి ఫుట్ బాల్ ప్లేయర్ గా ఉన్న రాజు అలా మారడానికి కారణం ఏంటి? అతడికి ఎదురైనా సమస్యలు ఏంటి? ఇవన్నీ మిగిలిన కథ..

    విశ్లేషణ :

    మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తే ఆదరించేందుకు ప్రేక్షకులు వెనుకాడడం లేదు.. ఇక ఈ మధ్య మలయాళం సినిమాలు కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాయి.. ఇక ఈ సినిమా టేకింగ్ కాస్త డిఫరెంట్ గా ఉంది.. ఫస్ట్ హాఫ్ మొత్తం పాత్రలను రివీల్ చేయడమే సరిపోగా సెకండాఫ్ లో అసలు కథను చూపించారు.. ఫస్ట్ హాఫ్ కొత్తగా అనిపించగా సెకండాఫ్ స్లోగా సాగింది.

    నటీనటుల పర్ఫార్మెన్స్ :

    దుల్కర్ సల్మాన్ పర్ఫెక్ట్ గా తన పాత్రకు తగ్గట్టు తనని తాను మార్చుకున్నాడు.. ఇక మరో హైలెట్ పాత్ర ఏంటంటే.. నైలా ఉష పోషించిన రోల్ ఈ సినిమాకే హైలెట్ అయ్యింది.. ఐశ్వర్య లక్ష్మి కూడా తన రోల్ కు తగ్గట్టు నటించగా మిగిలిన పాత్రలు కూడా బాగున్నాయి..

    టెక్నీకల్ పర్ఫార్మెన్స్ :

    ఈ సినిమాకు దుల్కర్ సల్మాన్ హీరోగా ఎలా కీ రోల్ పోషించాడో.. సంగీతం దర్శకుడు కూడా అలాంటి కీ రోల్ పోషించాడు.. ఈయన అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకే హైలెట్ గా నిలిచింది.. రవి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది.. 1980 కాలం నాటి సెట్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి.. కథనం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుని ఉండే డైరెక్టర్ గా మరింత స్థాయికి ఎదిగేవాడు..

    ప్లస్ పాయింట్స్ :

    నటీనటులు
    బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
    యాక్షన్ సీన్స్
    సినిమాటోగ్రఫీ

    మైనస్ పాయింట్స్ :

    కథలో కొత్తదనం లేకపోవడం
    స్లోగా సాగే సెకండాఫ్

    చివరిగా.. ఈ సినిమా స్లోగా సాగే విషయం పక్కన పెడితే యాక్షన్ ఎంటర్టైనర్ గా నిరాశ పరచదు అనే చెప్పాలి.. ఈ మధ్య కాలంలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్స్ లో కింగ్ ఆఫ్ కోత సినిమా కూడా ఒకటిగా నిలుస్తుంది.

    రేటింగ్ : 3/5

    Share post:

    More like this
    Related

    MI VS KKR : ముంబయి ఇండియన్స్  ఘోర ఓటమి

    MI VS KKR : వాంఖేడే లో కోల్ కతాతో జరిగిన...

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dulquer Salmaan : ఆమె అసభ్యకరంగా తాకింది.. దుల్కర్ సల్మాన్ కామెంట్స్ వైరల్!

    Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్ పేరు ఇప్పుడు పాన్ ఇండియా...

    ప్రభాస్ ప్రాజెక్ట్ – కె లో దుల్కర్ సల్మాన్ కూడా ?

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం '' ప్రాజెక్ట్...

    DR. SHIVAKUMAR AANAND: ఫోటోగ్రఫీ అంటే ప్రాణం : డాక్టర్ శివకుమార్ ఆనంద్

    ఫోటోగ్రఫీ సభ్యసమాజం పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కొన్నిసార్లు తమ అభిప్రాయాలను...