తాజాగా మహేష్ బాబు షర్ట్ విప్పేసిన లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు మహేష్ లుక్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మీమ్స్ కూడా మొదలయ్యాయి. ఆ మీమ్స్ కూడా వైరల్ గా మారాయి. మహేష్ బాబుని ఇంతవరకు రకరకాల లుక్స్ లో చూసారు అభిమానులు. కానీ షర్ట్ విప్పేసిన మహేష్ బాబుని ఇంతవరకు చూడలేదు దాంతో ఈ లుక్ వైరల్ గా మారింది.
అమ్మాయిల గుండెల్లో మంటలు పెట్టేలా ఉందట ఈ లుక్ దాంతో మహేష్ ….. మహేష్ అంటూ కలవరిస్తూ ఊహాలోకాల్లో తేలిపోతున్నారు అమ్మాయిలు , ఆంటీలు. ఇక మహేష్ బాబు అభిమానులు అయితే ఇది కదా ! ఊర మాస్ అంటే …… అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
స్విమ్మింగ్ పూల్ లో దిగుతున్న మహేష్ బాబు లుక్ అటు అమ్మాయిలను ఇటు అభిమానులను అందరినీ అలరిస్తోంది.
తాజాగా మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే. మహేష్ బాబుకు ఇది 28 వ సినిమా కావడం విశేషం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది 2023 ఏప్రిల్ 28 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అప్పుడే రిలీజ్ డేట్ కూడా అధికారికంగా ప్రకటించారు కూడా. ఈ చిత్రంలో మహేష్ తో రొమాన్స్ చేసేది ఎవరో తెలుసా ……. బుట్టబొమ్మ పూజా హెగ్డే.
Breaking News