మహేష్ బాబుతో నాకు తరచుగా గొడవలు జరుగుతూనే ఉంటాయని సంచలన వ్యాఖ్యలు చేసింది నమ్రత. తాజాగా నమ్రత ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించింది. భార్యాభర్తలు అన్నాక తప్పనిసరిగా గొడవలు జరుగుతుంటాయని అయితే మామధ్య గొడవలు జరగడానికి మాత్రం కారకులు మా పిల్లలే ! అని బాంబ్ పేల్చింది నమ్రత.
ఇక మాకు ఎందుకు గొడవలు వస్తాయంటే ……. పిల్లలు ఏదైనా కావాలని మొదటగా నన్నే అడుగుతారు. నేను కుదరదు …… వద్దు అని చెబుతాను దాంతో మహేష్ దగ్గరకు వెళతారు. ఇంకేముంది మహేష్ వాళ్ళు చెప్పినదానికి వెంటనే ఒప్పుకుంటాడు. దాంతో మా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఆ గొడవలు కొద్దిసేపే మళ్ళీ కలిసి పోతామని అంటోంది నమ్రత.
మహేష్ బాబు టాలీవుడ్ సూపర్ స్టార్ కావడంతో భారీ ఎత్తున రెమ్యునరేషన్ వస్తుంది కాబట్టి అలా వచ్చిన డబ్బులను పెద్ద మొత్తంలో రియాల్టీ రంగంలో పెట్టుబడులు పెట్టింది. అలాగే పలు కమర్షియల్ బిట్ లలో కూడా పెట్టుబడులుగా పెట్టింది. అవి పెద్ద మొత్తంలో అంటే వేల కోట్ల సంపాదనగా మారింది. ఇక మహేష్ బాబు ఇప్పటి వరకు నటించిన చిత్రాల్లో పోకిరి అంటేనే ఇష్టమట. ఇక మహేష్ బాబు – నమ్రత కలిసి నటించిన వంశీ సినిమా అస్సలు నచ్చలేదని అంది. కాకపోతే ఆ సినిమా నాకు స్పెషల్ అని అంటోంది. ఎందుకో తెలుసా ……. ఆ సినిమా వల్లే కదా ! మహేష్ బాబు నమ్రత ప్రేమలో పడింది.