నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన చెన్నకేశవ రెడ్డి చిత్రం 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ విడుదల అయ్యింది. వివివినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మించిన సంగతి తెలిసిందే. 2002 సెప్టెంబర్ 25 న చెన్నకేశవ రెడ్డి చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కట్ చేస్తే ఇరవై సంవత్సరాల తర్వాత భారీ ఎత్తున విడుదల చేసారు. అయితే ఓవర్ సీస్ లో మాత్రం సెప్టెంబర్ 24 నే విడుదల అయ్యింది.
ఏపీ , తెలంగాణ , కర్ణాటక లతో పాటుగా ఓవర్ సీస్ లో కూడా ఈ చిత్రం విడుదల కాగా ఓవర్ సీస్ లో మాత్రం అదరగొట్టింది చెన్నకేశవ రెడ్డి. ఓవర్ సీస్ లో ఏకంగా 32 లొకేషన్ లలో 82 స్పెషల్ షోలు వేశారు. ఇలా 32 లక్షలకు పైగా వసూల్ అయ్యాయి ఈ షోలతో. రీ రిలీజ్ లో ఇది తిరుగులేని రికార్డ్ ఇప్పటి వరకు.
ఎందుకంటే ఇటీవలే మహేష్ బాబు నటించిన పోకిరి చిత్రాన్ని ఓవర్ సీస్ లో రిలీజ్ చేయగా 13 లక్షల గ్రాస్ వసూల్ అయ్యింది. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన జల్సా రిలీజ్ చేయగా 30 లక్షల గ్రాస్ వసూల్ అయ్యింది. ఇక ఇప్పుడేమో బాలయ్య చెన్నకేశవరెడ్డి ఆ రెండు చిత్రాల రికార్డులను బద్దలు కొట్టేసింది. ఏకంగా 32 లక్షల వసూళ్లని సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించాడు బాలయ్య.