వాల్తేరు వీరయ్య చిత్రం నుండి శ్రీదేవి – చిరంజీవి లిరికల్ వీడీయో వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ” వాల్తేరు వీరయ్య ”. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న వాల్తేరు వీరయ్య చిత్రాన్ని 2023 జనవరి 13 న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
దాంతో తాజాగా నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అనే లిరికల్ వీడీయోను విడుదల చేసారు మేకర్స్. అందమైన లొకేషన్స్ లో ఈ పాటను అద్భుతంగా చిత్రీకరించారు. ఫ్రాన్స్ లోని మంచు ప్రాంతాల్లో ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాటను చూడటానికి రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి అంత బాగున్నాయి లొకేషన్స్.
ఇప్పటికే బాస్ పార్టీ సాంగ్ విడుదల కాగా ఆ పాట మాస్ ను విశేషంగా అలరించింది. ఇక ఇప్పటి శ్రీదేవి – చిరంజీవి పాట ప్రేమికులను ఆకట్టుకునే పాట కావడం విశేషం. ఈ పాటలో శృతి హాసన్ – చిరంజీవి చాలా చాలా అందంగా ఉన్నారు. వాల్తేరు వీరయ్య చిత్రంలో హీరో రవితేజ కూడా నటించడం విశేషం. కీలక పాత్రలో నటిస్తున్నాడు రవితేజ. ఉండేది కొద్దిసేపే అయినప్పటికీ చాలా పవర్ ఫుల్ రోల్ అని తెలుస్తోంది. భారీ తారాగణం ఉన్న వాల్తేరు వీరయ్య చిత్రం పై భారీగానే ఆశలు పెట్టుకున్నాడు చిరంజీవి.