34.8 C
India
Monday, May 27, 2024
More

    ‘గోపి’లుగా పొంగులేటి..జూప‌ల్లి…!

    Date:

    ponguleti jupalli
    ponguleti jupalli

    పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,జూప‌ల్లి కృష్ణారావు ఎవ‌రు అవున‌న్న కాద‌న్న వారి వారి జిల్లాల్లో వీరిద్ద‌రు చాలా బ‌ల‌మైన నేత‌లే. జూప‌ల్లి కృష్ణారావు పొంగులేటి అంత ఆర్థికంగా శ‌క్తివంతుడు కాకున్నా..గ‌ద్వాల్,వ‌న‌ప‌ర్తి జిల్లాల‌ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేసే స్థాయిలోనే ఉన్నారు. ఇక వీరిద్ద‌రిని బీఆర్ఎస్ కాద‌నుకున్న‌ప్ప టికీ ఆత్మీయ స‌మ్మేళ‌నాల‌తో పేరుతో ఆయా జిల్లాల్లో నిత్యం ప‌బ్లిక్‌లో హ‌డావుడి చేస్తున్నారు. పొంగులేటి అయితే ఖ‌మ్మం జిల్లాలో త‌న‌కంటూ ఓ క్యాడ‌ర్‌ను మెయింటెన్ చేస్తున్నారు. జూప‌ల్లి కూడా కొల్లాపూర్‌తో పాటు జిల్లా వ్యాప్తంగా ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు.

    అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉన్న ఈ ఇద్ద‌రు నాయ‌కులు ఇప్పుడు ఏ పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌నేదే ఆస‌క్తిక‌రంగా మారింది. ఈసారి ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ త‌ర‌పున ఒక్క ఎమ్మెల్యేను కూడా గెల‌వ‌నివ్వ‌బోన‌ని పొంగులేటి శ‌ప‌థం చేశారు. అంతేకాక త‌న‌ వెంట‌ ఉన్న కీల‌క‌మైన అనుచ‌రులంద‌రిని గెలిపించుకుంటాన‌ని వారికి గ‌ట్టి భ‌రోసానిస్తున్నారు. వారికి అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల అండ‌దండ‌ల‌ను అంద‌జేస్తాన‌ని చెబుతున్నారు. ఒక విధంగా రాబోయే ఎన్నిక‌ల త‌ర్వాత ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాల‌ను శాసించాల‌ని ఆశ ప‌డుతున్నారు. అటు జూప‌ల్లి కూడా ఇదే విధానాల‌తో ముందుకెళ్లుతున్నారు.

    ఇక ఈ నేత‌ల‌కు ఆయా జిల్లాల్లో మంచి ప‌ట్టు ఉండ‌డంతో అటు బీజేపీ,ఇటు కాంగ్రెస్‌లు త‌మ పార్టీలో జాయిన్ కావాల‌నే కోరుతున్నాయి. కాంగ్రెస్ అయితే పొంగులేటికి సీఎల్పీ నేత భ‌ట్టి,మ‌రో సెగ్మెంట్ త‌ప్ప మిగ‌తా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆయ‌న చెప్పిన వారికే రాబోయే ఎన్నిక‌ల్లో టికెట్లు ఇస్తామ‌ని చెబుతోంది. మ‌రోవైపై బీజేపీ మాత్రం పొంగులేటికి ఇప్ప‌టికీ స్ప‌ష్ట‌మైన భ‌రోసా ఇవ్వ‌న‌ప్ప‌టికీ..రానున్న ఎల‌క్ష‌న్స్‌లో ఖ‌మ్మం జిల్లా మొత్తాన్ని ఆయ‌న చేతుల్లోనే పెట్టేందుకు సిద్ధ‌మ‌నే సంకేతాల‌ను పంపుతోంది. వాస్త‌వానికి ఖ‌మ్మం రాజ‌కీయ వేదిక‌పై బీజేపీకి అంత‌గా ప‌ట్టులేదు. అందువ‌ల్లే పొంగులేటి లాంటి బ‌ల‌మైన నాయ‌కు డిని త‌మ పార్టీలో చేర్చుకోవాల‌ని కాషాయ నేత‌లు ఊవిళ్లూరుతున్నారు.

    అయితే బీజేపీ,కాంగ్రెస్‌ల నుంచి ఎలాంటి ఆఫ‌ర్స్ వ‌చ్చిన‌ప్ప‌టికీ…పొంగులేటి,జూప‌ల్లి ఈరెండు పార్టీల్లో ఏదో ఒక‌దాంట్లో చేర‌కుండా గోడ మీద పిల్లుల మాదిరి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శ‌లున్నాయి. ఈ విష యంలో వారి రాజ‌కీయ భ‌విష్య‌త్‌నే కాదు..వారి అనుచ‌రుల‌ను రాబోయే ఎన్నిక‌ల్లో గెలిపించుకోవాల‌నే వ్యూహాంలో భాగంగా ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకెళుతున్న‌ట్లు స‌మాచారం. అందుకే వేచి ధోర‌ణిని అవ‌లంభించ‌డం ద్వారా అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ నుంచి మ‌రిన్ని మంచి ఆఫ‌ర్లు రావొచ్చ‌ని ఇరువురు నేత‌లు చూస్తున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది.

    Share post:

    More like this
    Related

    Nilima Divi : హైదరాబాద్ లో లగ్జరీ ప్రాపర్టీలు కొన్న నీలిమా దివి

    Nilima Divi : హైదరాబాద్ లో లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్...

    Teacher Suspension : స్కూల్ వాట్సప్ గ్రూప్ చూడని టీచర్ సస్పెన్షన్

    Teacher Suspension : స్కూల్ వాట్సాప్ గ్రూప్ చూడట్లేదని ఓ టీచర్...

    Hardik-Natasa : హర్దిక్ పాండ్యా విడాకులు తీసుకోబోతున్నాడా..  నటాషా ఇన్ స్టా పోస్టుతో ప్రకంపనలు

    Hardik-Natasa : టీం ఇండియా క్రికెటర్ హర్దిక్ పాండ్యా విడాకులు తీసుకోబోతున్నడనే...

    CM Revanth : ఎంత పెద్ద సెలబ్రేటీలు ఉన్నా.. వదిలిపెట్టేది లేదు..

    CM Revanth : డ్రగ్స్ కేసులో ఎంత పెద్ద సెలబెట్రీలు ఉన్నా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Deputy CM : యాదాద్రి వివాదంపై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

    Deputy CM : యాదాద్రి ఆలయం వివాదం తెలంగా ణ డిప్యూటీ సీఎం...

    CM Revanth Reddy : జర్నలిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త: వారికి ఇళ్ళస్థలాలు!

    CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులకు తెలంగాణ సీఎం రేవంత్...

    CM Revanth : రేవంత్ నోటి దురుసుతో చెడ్డపేరు వస్తుంది!

    CM Revanth Reddy : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు,...

    KTR : రేవంత్ రెడ్డి గాలివాటం సీఎం.. ఆయన ప్రజల అభిమానం పొందిన వాడు కాదు..

    KTR : ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి...