CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు అందిస్తా మని ఆయన హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.
నిన్న సాయంత్రం జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు ల హౌసింగ్ సొసైటీ సభ్యులు రేవంత్ రెడ్డిని కలి సిన క్రమంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. జవహ ర్లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సభ్యు లు తమ సొసైటీకి కేటాయించిన ఇళ్లస్థలాలు అప్పగింత ప్రక్రియను వందరోజులలో మొదలు పెడతామని ఇచ్చిన హామీని అమలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
16 ఏళ్ళ క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిజాంపేట, పేట్ బషీరాబాద్ లలో 70 ఎకరాల స్థలాన్ని జర్నలిస్తులకు కేటాయించారని, కానీ అప్పటి నుండి ఇప్పటివరకు ఇళ్ళ స్థలాల అప్పగిం త జరగలేదని వారు సీఎం రేవంత్ రెడ్డి తో తెలిపా రు. సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చినా ఆ స్థలాలను తమ కు అప్పగించలేదన్నారు.
ఇక జర్నలిస్టులతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి సంబంధించిన ఇంటి స్థలాల అప్పగింతపై రోడ్డు మ్యాప్ తో తన వద్దకు వస్తే ఒక్క నిమిషంలో సంతకం పెడతానం టూ వారికి హామీ ఇచ్చారు. ఏ సంస్థకు నామినే టెడ్ చైర్మన్ నియమించకుండా, కేవలం మీడియా అకాడమీకే మొదట నామినేటెడ్ చైర్మన్ గా శ్రీనివా సరెడ్డిని నియమించాం అంటే ప్రభుత్వం జర్నలి స్టులకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో గమనిం చాలని ఆయన పేర్కొన్నారు.