34.1 C
India
Monday, June 17, 2024
More

    రక్తహీనతను దూరం చేసే ఆహారం ఏంటో తెలుసా?

    Date:

    anemia
    anemia food
    ప్రస్తుత రోజుల్లో పోషకాహారం అందడం లేదు. ఫలితంగా రోగాలు వస్తున్నాయి. చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటు, అల్సర్, థైరాయిడ్, నరాల బలహీనత వంటి వ్యాధులు చుట్టుముడుతున్నాయి. మనం తినే ఆహారమే మనకు ప్రతిబంధకంగా మారుతోంది. వ్యాధులు రావడానికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలో మన ఆహార శైలిని మార్చుకోవాలని వైద్యులు చెబుతున్నా అందరు ఫిజాలు, బర్గర్లు తింటూ తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. దీంతో సమస్యల బారిన పడుతున్నారు. అలసట, ఆందోళన, నీరసం వంటివి బాధిస్తున్నాయి. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే ఓ పరిష్కారం ఉంది.

    డ్రై ఫ్రూట్స్ మనకు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. మనకు నీరసం రాకుండా ఉండాలంటే వీటితో తయారు చేసుకునే లడ్డు మనకు బాగా ఉపయోగపడుతుంది. అదెలా తయారు చేసుకోవాలంటే ఒక మిక్సీ జార్ లో ఒక కప్పు కొబ్బరి ముక్కలు వేసుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక కప్పు ఎండు ఖర్జూరం వేసి పొడి చేసుకోవాలి. అనంతరం బాదం, పిస్తా, జీడి పప్పు వేసుకుని పొడి చేసుకోవాలి.

    పొయ్యి మీద పాన్ పెట్టి ఈ పొడులను మూడు నుంచి నాలుగు నిమిషాలు డ్రైగా వేయించుకోవాలి. వేయించిన పొడులను ఒక బౌల్ లోకి తీసుకోవాలి. అదే పాన్ లో మరో పావు కప్పు గోధుమ పిండిని వేయించాలి. అరకప్పు నెయ్యి వేసి ఆ పొడులను వేయించాలి. అదే పాన్ లో ఒక స్పూన్ నెయ్యి వేసి అందులో బెల్లం వేసి కరిగాక ఈ పొడులు వేసి వేయించుకుని నెయ్యి కలిపి లడ్డూలుగా చేసుకోవాలి.

    ఈ లడ్డులను ప్రతి రోజు ఒకటి చొప్పున తినాలి. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు వీటిని తీసుకోవచ్చు. దీని వల్ల రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు. అలసట, ఆందోళన రాకుండా ఉంటాయి. ఎంతో బలవర్ధకమైన ఆహారంగా దీన్ని తీసుకోవడం వల్ల మన శారీరక బలం పెరుగుతుంది.

    Share post:

    More like this
    Related

    CM Revanth : బస్టాండ్ లో కాన్పు చేసిన ఆర్టీసీ మహిళా సిబ్బంది.. సీఎం అభినందనలు

    CM Revanth : కరీంనగర్ బస్టాండ్ లో గర్భిణికి కాన్పు చేసి...

    CM Chandrababu : పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొంది: సీఎం చంద్రబాబు

    CM Chandrababu : రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు అనేక...

    Suicide : ప్రియుడి వద్దకు వెళ్లద్దన్నందుకు.. వివాహిత సూసైడ్..

    Suicide : ప్రస్తుత రోజుల్లో మూడు ముళ్ల బంధం అపహాస్యంగా మారుతోంది....

    Nellore : కారును ఢీకొట్టిన పెద్దపులి.. నెల్లూరు-ముంబై హైవేపై ఘటన

    Nellore : వేగంగా ప్రయాణిస్తున్న ఓ కారును పెద్దపులి ఒక్కసారిగా ఢీకొట్టింది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Food shortage : అన్నమో రామచంద్రా!

    -25 శాతం తగ్గిన సాగు: తాగు సాగు నీటి ఎద్దడి: నిత్యవసరాలకు...

    Multiple Sclerosis : పాలు, కూరగాయలు కూడా జీర్ణించుకోలేని రోజులు.. 5 వేల ఏళ్ల కిందట ఏం జరిగింది

    Multiple sclerosis : జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధుల నుంచి మన...

    FIVE HABITS: ఈ ఐదు అలవాట్లతో పరిపూర్ణ ఆరోగ్యం

      కొన్ని పద్ధతులు పాటిస్తే పరిపూర్ణమైన ఆరోగ్యంతో  జీవించవచ్చు అని వైధ్యలు అంటున్నారు....