35 C
India
Saturday, May 4, 2024
More

    Avinash Reddy : అవినాష్ మరోసారి డుమ్మా

    Date:

    • విచారణకు రాలేనన్న కడప ఎంపీ
    Avinash Reddy
    Avinash Reddy

    కడపలో వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న  ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని శుక్రవారం సీబీఐ విచారణకు మరోసారి డుమ్మా కొట్టారు. ఆయన హాజరు కాకపోవడం వరుసగా ఇది రెండో సారి. వ్యక్తిగత కారణాలతో రావట్లేదని ఆయన గతంలో సమాచారం ఇచ్చారు. తాజాగా శుక్రవారం విచారణకు రావాలని సీబీఐ నోటీసులు పంపగా, తల్లి అనారోగ్యం కారణంగా హాజరు కావట్లేదని చెబుతున్నారు.

    వివేకా హత్య కేసులో కీలకంగా వినిపించిన వారందరినీ సీబీఐ ఇప్పటికే అరెస్ట్ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో సీబీఐ కేసు దర్యాప్తులో వేగం పెంచింది. అవినాష్ రెడ్డి పాత్ర కీలకంగా ఉన్నట్లు సీబీఐ నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఆయన తండ్రిని అరెస్ట్ చేసి జైలుకు పంపింది. అవినాష్ ను కూడా ఇప్పటికే ఏడు సార్లు విచారించింది.

    అయితే అవినాష్ ను అరెస్ట్ చేసేందుకు సీబీఐ రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన మరోసారి విచారణకు డుమ్మాకొట్టడం సీబీఐ సీరియస్ గా తీసుకుంది.  ఏదో కారణం చెబుతూ విచారణకు డుమ్మా అవుతుండడం సీబీఐ కీలకంగా తీసుకుంది. అయితే తల్లి అనారోగ్యం కారణంగా అవినాష్ పులివెందులకు తెలుస్తున్నది. అయితే అవినాశ్ విన్నపాన్ని సీబీఐ తిరస్కరించింది, హుటాహుటిన సీబీఐ బృందాలు పులివెందుల బయలుదేరి వెళ్లాయి. సీబీఐ తదుపరి చర్యలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక అవినాష్ ను బలవంతంగా అదుపులోకి తీసుకుంటుందా అనే చర్చ కూడా కొనసాగుతున్నది. ఏదేమైనా సాయంత్రాని కల్లా సీబీఐ తీసుకునే చర్యలపైనే టాక్ నడుస్తున్నది. అవినాష్ అరెస్ట్ ఖాయమనే నేపథ్యంలో పులివెందులలో పోలీస్ భద్రతను కూడా కట్టుదిట్టం చేసినట్లు సమాచారం.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Avinash Reddy : వైఎస్ అవినాష్ బెయిల్ రద్దుకు సీబీఐ పిటిషన్

    YS Avinash Reddy : ఏపీ సీఎం సోదరుడు, కడప ఎంపీ వైఎస్...

    Deadline in Viveka’s murder case : వివేకా హత్య కేసులో ముగిసిన గడువు.. సీబీఐ తేల్చిందేమిటో..?

    Deadline in Viveka's murder case : కడపలో వైఎస్ వివేకానందరెడ్డి...

    Breaking News : వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిని 8వ నిందితుడిగా చేర్చిన సీబీఐ..!

    Viveka murder case : మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి...

    Relief to Avinash : అవినాష్ కు తెలంగాణ హైకోర్టు ఊరట..

    Relief to Avinash : వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న...