తనకు వచ్చిన ఓట్లు కూడా జనసేన పార్టీకి రాలేదని పవన్ కళ్యాణ్ పై కొందరు అనవసరంగా ఆయన పై ట్రోలింగ్ చేయటం నాకు నచ్చడం లేదని బర్రెలక్క అన్నారు. ఎవరి పార్టీ వారిది.. ఎవరి రాజకీయం వారిది. పవన్ కళ్యాణ్ ను తక్కువ చేసి మాట్లాడటం నాకు బాధగా అనిపించిందని ఆమె తెలిపారు. నిజానికి నేను పవన్ కల్యాణ్ అభిమానిని ఆయన చాలా మంచివారని బర్రెలక్క అన్నారు. కల్యాణ్ గ్రేట్ పర్సన్ అని ఆయనను మైనస్ చేయడానికి నన్ను వాడటం కరెక్ట్ కాదని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.