టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కోన వెంకట్ వైఎస్ జగన్ పాలనపై ప్రశంసలు కురిపించారు. తన సొంత ఆయన సొంత గ్రామం అయిన బాపట్ల జిల్లా కర్లపాలెం లో ప్రభుత్వ పాఠశాలను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. స్కూల్ వాతావరణం, వసతులు, తరగతి గదులను ఆయన పరిశీలించారు. నా సొంత ఊర్లో ఇంతటి అద్భుతమైన ప్రభుత్వ పాఠశాల ఉన్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. స్కూల్ పరిసర ప్రాంతాలను చూసి ఆశ్చర్యపపోయిన కోన వెంకట్ వెంటనే తన సెల్ ఫోన్ లో సెల్పీ తీసుకోని ఫోటోలను రిలీజ్ చేసి తన అనుభవాలను పంచుకున్నారు.
గతంలో ప్రభుత్వ స్కూల్స్ ఉంటే సరిగ్గా ఉండేవి కాదని అరకోర సౌకర్యాలతో మౌళిక వసతులు సరిగ్గా ఉండేవి కాదన్నారు. కానీ జగన్ సిఎం అయ్యా క ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని కోన వెంకట్ తెలిపారు. కార్పోరేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయని తాను ఈ పాఠశాలలను చూసి ఆశ్చర్య పోయిన ఆయన సెల్పీ తీసుకోని ఆ ఫోటోలను బయటకు రిలీజ్ చేయడంతో ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
జగనన్న సంక్షేమ పాలనకు ఇది ప్రత్యేక నిదర్శనం అంటూ పలువురు వైసిపి కార్యకర్తలు అభిమానులు సైతం కామెంట్స్ కురిపిస్తున్నారు.. ప్రస్తుతం ఈయన గీతాంజలి సీక్వెళ్లిన తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు ఇందులో హీరోయిన్గా అంజలి నటిస్తోంది ఇటీవల ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా అనౌన్స్మెంట్ చేశారు.. ఈ సినిమా హర్రర్ త్రిల్లర్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాని తెరకెక్కించారు. గీతాంజలి-2 కోసం కోనా వెంకట్ కథా స్క్రీన్ ప్లే ని అందించబోతున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఈయన చేసినటువంటి ట్విట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.