32.2 C
India
Friday, March 1, 2024
More

  Muscat : మస్కట్‌లో ఘనంగా సంక్రాంతి వేడుకలు..హాజరైన తెలుగు ప్రముఖులు

  Date:

   

  ఒమన్ దేశ రాజధాని మస్కట్‌లో సంక్రాంతి వేడుకలు  ఘనంగా జరిగాయి. ఒమన్‌లో స్థిరపడ్డ తెలుగు ప్రజలు, తెలుగు ప్రముఖుల మధ్య రెండు రోజుల పాటు శోభాయమానంగా వేడుకలు నిర్వహించారు. ‘రాయల్ కింగ్ హోల్డింగ్‌’తోపాటు ‘చిరు మెగా యూత్ ఫోర్స్’ సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడుకలు అందరినీ అలరించాయి.

  ఇటీవల సినీరంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రముఖులు.. డా. మాగంటి మురళీ మోహన్ గారిని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఒమన్ దేశ చిహ్నం అయిన కంజరి నడుముకు తొడిగి స్వర్ణ కంకణంతో గౌరవించడం ఈ వేడుకలో ప్రధానఘట్టంగా నిలిచింది. టాలీవుడ్ నిర్మాత, సినీ పంపిణీదారు వ్యాపారవేత్త బుర్ర ప్రశాంత్ గౌడ్‌తోపాటు సీపీవైఎఫ్‌ వ్యవస్థాపక అధ్యక్షలు రామదాస్ చందక ఈ వేడుకలు నిర్వహించారు. డా. మురళీమోహన్‌తో పాటు టాలీవుడ్ నటీమణులు.. రజిత, మధుమని, పింకీ, సోనియా చౌదరి, టివి నటి సంజన సంక్రాంతి వేడుకలకు కొత్త కళను తెచ్చారు. వేడుకలకు కుమారి మాధవి రెడ్డి చేసిన యాంకరింగ్‌ ఆకట్టుకుంది.

  సింగర్లు హనుమాన్, స్వాతి సత్యభామ, మోనికా యాదవ్ లు తమ సంగీతంతో ప్రేక్షుకలును కట్టిపడేసారు. పాటలకు తగ్గ డ్యాన్సులతో సందడి నెలకొంది. వేడుకలో ఢీ ఫేమ్ గోవింద్ టీమ్ స్టెప్పులతో స్టేజిని దులిపారు. జబర్దస్త్ సుధాకర్ తన కామెడీతో కడుపు ఉబ్బా నవ్వించారు. ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన మరో కళాకారుడు ఎమ్‌ఎస్‌ఆర్‌ నాయుడు తన వెంట్రిలాక్కుజమ్ నైపుణ్యంతో పిల్లలను అలరించారు. ఈ సంక్రాంతి సంబరాలకు హైదరాబాద్ నుంచి ఇన్‌కంటాక్స్‌ మాజీ అధికారి శ్రీకర్ వేముల, వ్యాపారవేత్త రమేష్ గౌడ్‌లు హాజరయ్యారు. ఒమన్‌లో వివిధ రంగాల్లో వ్యాపారాభివృద్ధి గురించి పరిశీలన చేశారు.

  Share post:

  More like this
  Related

  Neha Shetty : నేహా శెట్టి వారణాసి ఘాట్‌లు & గ్రేస్‌ని ఆలింగనం చేసుకుంది

  Neha Shetty : డీజే టిల్లుతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్...

  JaganVadina : పవన్ పెళ్లిళ్లపై జగన్ కు ఎందుకు? #JaganVadina ట్రెండింగ్ తో ప్రశ్నిస్తున్న జనసేన నాయకులు

  JaganVadina : మొన్నటికి మొన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం...

  Increasing VIPs : దేశంలో పెరిగిపోతున్న వీఐపీ, వారి ఖర్చు.. ఇతర దేశాల్లో ఎంతంటే?

  Increasing VIPs : -బ్రిటన్‌లో అధికారికంగా 84 మంది వీఐపీలు ఉన్నారు! -ఫ్రాన్స్‌లో...

  Frogs Marriage : కప్పలకు పెళ్లెందుకు చేస్తారో తెలుసా? దీని వెనకున్న కథ ఇదీ..

  Frogs Marriage Behind Story : భారత్ లో ఇప్పటికీ వివిధ...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  NAT’S : డల్లాస్‌లో నాట్స్ తెలుగు వేడుకలు

      డల్లాస్‌లో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) తెలుగు వేడుకలు మార్చి 15,16...

  Telangana Shakat :డిల్లీ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో… తొలిసారి తెలంగాణ శకటం

  దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు....

  UAE: యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

                  UAE: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్  యూఏఈలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. తెలుగు...

  CANADA: కెనడా లో సంక్రాంతి సంబరాలు

        తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా ఆద్వర్యంలో   సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తాకా...