ఉరవకొండ సభలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన చెల్లి వైఎస్ షర్మిల ఇటీవల కాంగ్రెస్ పార్టీ పిసిసి అద్యక్షురాలిగా భాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లా పర్యటనలు చేపట్టి ప్రభుత్వ తీరుపై ఆమె విమ ర్శలు మెదలు పెట్టారు. చెల్లి చేస్తున్న విమర్శల పై అన్న జగన్మోహన్ రెడ్డి పరోక్ష వ్యాఖ్యలు చేయంతో రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి చంద్రబాబు అభిమాన సంఘం చేరారన్నారు. హైదరాబాద్‌లో ఉండి చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్‌గా పనిచేస్తున్నారని ఆరోపించారు.
జాకి ఎత్తి చంద్ర బాబును లేపేందుకు కష్టపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వీళ్ల ఇల్లు, వాకిలి అంతా పక్క రాష్ట్రలో ఉన్నాయని కానీ రాజకీయులు మాత్రం ఇక్కడ చేస్తున్నారని ఆయన షర్మిల,చంద్రబాబు, ప వన్ కల్యాణ్ లను ఉద్దేశించి ఈ వ్యాఖ్యులు చేశారు. పరస్పర వ్యాఖ్యల నేపధ్యంలో ఏపిలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఏపిలో పర్యటిస్తున్న షర్మిల వైసిపి నేతలుకు కంటిమీద కునుకు లేకుండా చే స్తోంది. రాష్ట్రం లో ఏమి అబివృద్దిచేశారో చర్చకు రావాలని వైసిపి నేతలకు షర్మిల సవాలు విసురు తున్నారు.