తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. మెట్ల మార్గం., రోడ్డు మార్గం గుండా భారీ స్థాయిలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. సెలవుల నేపథ్యంలో భారీ సంఖ్యలో తమిళనాడు, కర్ణాటక భక్తులు తిరు మలకు వస్తున్నారు. తిరుమలంతా గోవిందనామ స్మరణతో మారుమ్రోగుతుంది. శుక్రవారం ప్రభుత్వ సెల వు దినం రావడం…నేడు శనివారం కావడంతో అలిపిరి., శ్రీవారి మెట్ల మార్గం నుంచి పైగా భక భక్తుల కోలా హ లం కనిపిస్తుంది. ఎటు చూసిన గోవిందా..గోవిందా అంటూ భక్తులు క్యూలైన్ లోకి చేరుకుంటున్నారు.
ఇప్పటికే వైకుంఠం క్యూ కాంపెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. శుక్రవారం ఉదయం నుం చి తిరుమలలో అనూహ్య రీతిలో భక్తుల రద్దీ కొనసాగుతూ వస్తుంది. ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగి వైకుం ఠం క్యూ కాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయింది. నారాయణ గిరి ఉద్యానవనంలోని 9 షెడ్లు భక్తులతో నిండి క్యూ లైన్ బాట గంగమ్మ ఆలయం వరకు వ్యాపించి ఉంది. ఈ రద్దీ ఆదివారం., సోమవారం మరింత రద్దీ కొనసాగే అవకాశం కనిపిస్తుంది.
ఇప్పటికీ ఇప్పుడు క్యూలైన్ లో చేరుకున్నా భక్తులకు దాదాపు 24 గంటల నుంచి 30 గంటల అనంతరం శ్రీవారి దర్శన భాగ్యం కలిగే అవకాశం ప్రస్తుతం తిరుమలలో కనిపిస్తుంది. ఇక క్యూలైన్ లో వేచియున్న భక్తులకు టీటీడీ అన్నప్రసాదం., పాలు., మజ్జిగ., సుండల్ అందిస్తోంది. క్యూలైన్ లో ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది టీటీడీ. ఇక నడక మార్గలలో దాదాపు 4 వేల టోకెన్స్ ను టీటీడీ రద్దు చేసింది. తిరుమలలో నెలకొన్న భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం సైతం టోకెన్ల కుదింపు చేసే అవకాశం కనిపిస్తుంది.