
Zomato: కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల నోటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించినా అది పూర్తిస్థాయిలో కాదని ఆర్బీఐ చెబుతోంది. దీంతో అసలు రూ.2 వేల నోటు రద్దు చేశారా? లేదా? అనేది తేలడం లేదు. ఈ నేపథ్యంలో ప్రజలు రూ.2 వేల నోటుపై ఎటు తేల్చుకోవడం లేదు. ఇటీవల ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ రూ.2 వేల నోటును ఇంకా రద్దు చేయలేదని సూచించారు. సెప్టెంబర్ తరువాత దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పడం గమనార్హం.
దీంతో రూ. 2వేల నోట్లను జొమాటో సంస్థ తీసుకునేందుకు సిద్దమైంది. ప్రజలు బ్యాంకుల చుట్టు తిరిగే అవసరం లేకుండా జొమాటోలో ఆర్డర్ ఇచ్చి మార్చుకోవచ్చని తెలిపింది. దీంతో బ్యాంకుల చుట్టు తిరిగే పని లేకుండా 72 శాతం క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు తీసుకుంటోంది.
రూ. 2వేల నోట్లను సెప్టెంబర్ 30లోపు మార్చుకోవాలని సూచించింది. ప్రజలు బ్యాంకుల్లో తమ దగ్గర ఉన్న నోట్లను చెల్లించుకోవాలని తాపత్రయపడుతున్నారు. ప్రజలు బ్యాంకుల చుట్టు తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో జొమాటోతో వారి కష్టాలకు చెక్ పడనుంది.
2016లోనే నోట్ల రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రూ.2 వేల నోట్లను రద్దు చేసేందుకు మళ్లీ నిర్ణయం తీసుకోవడం సంచలనం కలిగించింది. ఇప్పుడు మళ్లీ రెండు వేల నోటు రద్దు చేయడంపై ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం మాటిమాటికి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.