Adipurush : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో ఘోర పరాభవంగా మిగిలిన సినిమా ”ఆదిపురుష్”.. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకోగా దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకుంది.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ప్రభాస్ ఫ్యాన్స్ వరుసగా రెండు పరాజయాలు ఎదురవడంతో ఆదిపురుష్ తో అయిన తమ హీరో హిట్ అందుకోవాలని కోరుకున్నారు.
కానీ ముందు రెండింటి కంటే దారుణమైన ప్లాప్ చవిచూడక తప్పలేదు. బాహుబలి రేంజ్ లో హిట్ అవుతుంది అని ఎన్నో ఆశలు పెట్టుకోగా ఆశలన్నీ ఓం రౌత్ నిరాశ చేసాడు. రామాయణం నేపథ్యంతో భారీ స్థాయిలో మైథలాజికల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయ్యి ముందులో మిశ్రమ స్పందన తెచ్చుకుంది..
కానీ ఆ తర్వాత ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందనకు ఆదిపురుష్ టీమ్ కు చుక్కులు కనిపించాయి. కనీసం డార్లింగ్ ఫ్యాన్స్ ను కూడా మెప్పించలేక పోయారు మేకర్స్. ఈ విషయంలో ఓ రేంజ్ లో మేకర్స్ ను ట్రోల్స్ చేసారు.. ఓం రౌత్ ను దారుణంగా విమర్శించారు.. ఇదిలా ఉండగా ఈ సినిమా థియేటర్స్ లో కలెక్షన్స్ లేక దారుణంగా ప్లాప్ అయ్యింది.
అయితే ఇప్పుడు ఈ సినిమాను ఓటిటి లోకి తీసుకు వచ్చారు.. ఆదిపురుష్ సినిమాను రెండు ఓటిటి ప్లాట్ ఫామ్స్ లోకి స్ట్రీమింగ్ చేసారు.. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ రెండింటిలో స్త్రీమింగ్ కు వచ్చేసింది. మరి ఆదిపురుష్ థియేటర్స్ లో దారుణంగా విఫలం కాగా ఓటిటిలో అయినా హిట్ అందుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే..